వాళ్లకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కావాలి, మనకి ఐపీఎల్ కావాలి... అదే జరుగుతోంది! లెక్క సరిగానే ఉందిగా...

Published : Jun 09, 2023, 03:28 PM ISTUpdated : Jun 09, 2023, 03:29 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కి వరుసగా రెండోసారి అర్హత సాధించింది టీమిండియా. మార్చి పోతే సెప్టెంబర్ అన్నట్టుగా టీమిండియాకి రెండోసారి టైటిల్ గెలిచేందుకు అవకాశం దక్కింది. అయితే సీన్ మాత్రం మారలేదు...

PREV
110
వాళ్లకి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కావాలి, మనకి ఐపీఎల్ కావాలి... అదే జరుగుతోంది! లెక్క సరిగానే ఉందిగా...

మొదటి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఎలా ఆడిందో, అంత దారుణంగా సాగుతోంది టీమిండియా ప్రదర్శన. టీమిండియా బౌలర్లు అట్టర్ ఫ్లాప్ కావడంతో మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 469 పరుగుల భారీ స్కోరు సాధించింది..

210

ఇంత భారీ స్కోరు సాధించిన తర్వాత ఆస్ట్రేలియా ఓడిపోవాలంటే అద్భుతం ఏదో జరగాలి. ఆస్ట్రేలియా బౌలర్లు చితక్కొట్టిన చోట, భారత బ్యాటర్లు బ్యాటు పట్టుకోవడానికి కూడా కష్టపడుతున్నారు...

310

భారత టాపార్డర్ అట్టర్ ఫ్లాప్ కావడంతో 71 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది టీమిండియా. కెప్టెన్ రోహిత్ శర్మ 15, శుబ్‌మన్ గిల్ 13, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ చెరో 14 పరుగులు చేసి అవుట్ అయ్యారు...

410

బ్యాటింగ్ కోసమే అశ్విన్‌ని పక్కనబెట్టి, జడేజాని తీసుకున్నందుకు దానికి న్యాయం చేస్తూ జడ్డూ 48 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్‌ని కాదని టీమ్‌లోకి తీసుకొచ్చిన శ్రీకర్ భరత్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు..
 

510

దీంతో ఎప్పటిలాగానే ఐసీసీ టోర్నీల్లో అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు  ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి టీమిండియా ఫ్యాన్స్. ప్రస్తుతం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న భారత జట్టులోని ఛతేశ్వర్ పూజారా, శ్రీకర్ భరత్ మినహా మిగిలిన ప్లేయర్లు అందరూ ఐపీఎల్‌లో యమా బిజీగా గడిపారు...
 

610

రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. 14 అంతకంటే ఎక్కువ మ్యాచులు ఆడి, అలసిపోయి... ఇంగ్లాండ్ చేరుకున్నారు..
 

710

ఇదే సమయంలో ఆస్ట్రేలియా టీమ్‌లోని స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్‌లకు ఐపీఎల్‌లో మంచి డిమాండ్ ఉన్నా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి మెంటల్‌గా, ఫిజికల్‌గా సిద్దంగా ఉండేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకున్నారు..
 

810

అనుకున్నట్టే స్టీవ్ స్మిత్, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో సెంచరీ బాదితే ట్రావిస్ హెడ్‌ 163 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. వీరి దెబ్బకు మొదటి 2 రోజుల్లో టీమిండియాకి ఏదీ కరెక్టుగా కలిసి రాలేదు...
 

910

ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 250+ పరుగుల స్కోరు చేసినా నాలుగో ఇన్నింగ్స్‌లో ఎంత లేదన్నా 450 నుంచి 500+ టార్గెట్‌ని ఛేదించేందుకు సిద్ధంగా ఉండాలి. తొలి ఇన్నింగ్స్‌లో మనోళ్ల బ్యాటింగ్ చూశాక రెండో ఇన్నింగ్స్‌లో మహా అయితే 300+ స్కోరు చేయగలరేమో...

1010

ఈ మ్యాచ్‌లో టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వాలంటే రెండో ఇన్నింగ్స్‌లో తిరుగులేని ఆధిక్యం చూపించాలి. ఆసీస్ టీమ్‌ని 100లోపే ఆలౌట్ చేయగలగాలి. ఎంత చేసినా భారత బ్యాటర్లు పట్టు వదలకుండా క్రీజులో నిలబడి, పరుగుల ప్రవాహం కురిపించగలిగాలి. కానీ టీమిండియా ఫ్యాన్స్‌కి మాత్రం ఆశలు లేవు.. 

click me!

Recommended Stories