ఆసియాకప్ - 2023 వివాదం కొనసాగుతున్న వేళ పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడుతుందా..? లేదా..? అన్నది ఇప్పటికైతే తేలలేదు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం మాటే ఫైనల్ అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) భావిస్తున్నది.
ఒకపక్క ఐసీసీ.. భారత్ లో వన్డే వరల్డ్ కప్ ను సక్సెస్ చేసేందుకు అన్ని టీమ్ లను పాల్గొనేలా చేయడంపై దృష్టి సారించింది. మిగిలిన టీమ్స్ తో ఐసీసీకి ఇబ్బందులేమీ లేకపోయినా పాకిస్తాన్ మాత్రం భారత్ లో ఆడటంపై కొర్రీలు పెడుతోంది.
25
Image credit: Wikimedia Commons
ఈ ఏడాది జరుగాల్సి ఉన్న ఆసియా కప్ దాదాపుగా పాకిస్తాన్ నుంచి దూరమైన నేపథ్యంలో పీసీబీ.. వరల్డ్ కప్ కోసం బాబర్ ఆజమ్ సేనను భారత్ లోకి పంపిస్తుందా..? లేదా..? అన్నది సందిగ్దంగానే ఉంది. ఇదే విషయమై చర్చించడానికి ఐసీసీ అధ్యక్షుడు జార్జ్ బార్క్లే ఇటీవలే పాకిస్తాన్ లో పర్యటించారు.
35
Image credit: Getty
ఈ సందర్భంగా పీసీబీ అధ్యక్షుడు నజమ్ సేథీ ఓ వింత ప్రతిపాదనను బార్క్లే ముందు ఉంచినట్టు తెలుస్తున్నది. భారత్ లో జరిగే వరల్డ్ కప్ లో ఆడాలంటే తాము అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడబోమని కోరినట్టు పీసీబీ ప్రతినిధులు తెలిపారు.
45
ఇదే విషయమై పీసీబీ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇటీవలే పీసీబీ చీఫ్ తో సమావేశమైన ఐసీసీ ప్రతినిధులు బార్క్లే, అలార్డైస్ లకు ఆయన (నజమ్ సేథీ) ఒక విషయాన్ని అయితే క్లీయర్ గా చెప్పారు. పాకిస్తాన్ అహ్మదాబాద్ లో మ్యాచ్ లు ఆడదు. అందుకు బదులుగా పాక్ ఆడే మ్యాచ్ లను చెన్నై, కోల్కతా, బెంగళూరులో జరిపించాలని కోరారు. ఒకవేళ అది నాకౌట్, ఫైనల్ మ్యాచ్ అయితే తప్ప పాక్ మ్యాచ్ లను ఇతర వేదికలను మార్చాలని చెప్పార’ని వెల్లడించాడు.
55
అయితే ఇది కూడా పాకిస్తాన్ ప్రభుత్వం తమ జట్టును భారత్ లో ఆడేందుకు పంపిస్తేనే సాధ్యమవుతుందని కూడా పీసీబీ చీఫ్ ఐసీసీకి తేల్చి చెప్పినట్టు సమాచారం. భారత జట్టు ఆసియా కప్ ఆడేందుకు పాకిస్తాన్ రాబోమని మంకు పట్టుదల ప్రదర్శిస్తుండటంతో పాక్ కూడా అదే వైఖరిని అవలంభిస్తున్నది.