‘గిల్ అంటే కొత్త కుర్రాడు.. నేర్చుకుంటున్నాడు.. వంద టెస్టులు ఆడిన పుజారా అనుభవం ఏమైంది..?’

Published : Jun 09, 2023, 10:30 AM IST

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ లో టీమిండియా  బ్యాటింగ్ వైఫల్యంతో  ఓవల్ లో ఎదురీదుతోంది. ఆసీస్ పేసర్ల ధాటికి టీమిండియా టాపార్డర్ విఫలమైంది.  

PREV
16
‘గిల్ అంటే కొత్త కుర్రాడు.. నేర్చుకుంటున్నాడు.. వంద టెస్టులు ఆడిన పుజారా అనుభవం ఏమైంది..?’

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో  టీమిండియా ఎదురీదుతోంది. తొలి రోజు బౌలింగ్ లో విఫలమైన  భారత జట్టు రెండో రోజు మెరుగ్గానే బౌలింగ్ చేసి ఫలితాలు రాబట్టింది. కానీ ఆస్ట్రేలియన్లు 469 పరుగులు చేసిన పిచ్ పై  భారత టాపార్డర్ బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకునేందుకే తంటాలుపడ్డారు.  

26

తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాపార్డర్  బ్యాటర్లు రోహిత్, విరాట్ కోహ్లీ, ఛటేశ్వర్ పుజారాతో పాటు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్  కూడా   విఫలమయ్యారు.  రోహిత్ ఎల్బీగా నిష్క్రమించగా  కోహ్లీ.. స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్, పుజారాలు మాత్రం ఒకే విధంగా ఔటయ్యారు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా పడ్డ బంతులను జడ్జ్ చేయడంలో విఫలమై వికెట్లు సమర్పించుకున్నారు. 

36

తొలుత గిల్.. స్కాట్ బొలాండ్ బౌలింగ్  లో తర్వాత పుజారా  కామెరూన్ గ్రీన్ బౌలింగ్  లో ఒకే విధంగా నిష్క్రమించారు. దీనిపై తాజాగా టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి   తీవ్రంగా స్పందించాడు.  గిల్ అంటే కొత్త కుర్రాడని, అతడింకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, కానీ వంద టెస్టులకు పైగా ఆడిన పుజారా అనుభవం ఏమైందని శాస్త్రి వాపోయాడు. 

46

డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో కామెంట్రీ విధులు నిర్వర్తిస్తున్న  శాస్త్రి మాట్లాడుతూ..  ‘ఈ ఇద్దరూ (గిల్, పుజారా) ఔటైన విధానం చూడండి. బంతిని  ఆడాలనుకుని తర్వాత వదిలేస్తే వికెట్లను కవర్ చేస్తూ  బాల్ వదిలేయాలి.  కానీ  ఇద్దరూ ఔటైనప్పుడు వాళ్ల ఫ్రంట్  ఫూట్ మిడిల్ స్టంప్ కు సూటిగా ఉంది. బంతిని వదిలేయాలనుకుంటే ఫుట్ మూమెంట్ కూడా  అందుకు అనుగుణంగా ఉండాలి.  

56

ఇది   కచ్చితంగా రాంగ్ జడ్జ్మెంట్.  అయితే ఇలా ఔటవడం గిల్  కు  కొత్తే. కానీ అతడు కుర్రాడు. ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాడు.  మరి వంద టెస్టులకు పైగా ఆడిన అనుభవం ఉన్న  పుజారా పరిస్థితి ఏంటి..? అతడి అనుభవం ఏమైంది. అంతేగాక గతంలో అతడు సర్రే (కౌంటీ ఛాంపియన్‌షిప్)  తరఫున ఆడినప్పుడు ఓవల్  లో చాలా మ్యాచ్ లు ఆడాడు. 

66

గతేడాది  కూడా భారత్ - ఇంగ్లాండ్ రీషెడ్యూల్డ్ టెస్ట్  మ్యాచ్ లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కూడా పుజారా  ఇక్కడ కౌంటీలలో బాగా ఆడి తీరా ఈ టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. పుజారాకు కౌంటీలలో ఆడిన అనుభవం ఏమౌతోంది..? బంతిని అంచనా వేయడంలో అతడు ఎందుకు తడబడుతున్నాడో అర్థం కావడం లేదు..’ అని వ్యాఖ్యానించాడు.  

Read more Photos on
click me!

Recommended Stories