ఇలాంటి పరిస్థితుల్లోనూ రిషబ్ పంత్‌ని వదలని ఊర్వశి రౌతెల్లా... హాట్ ఫోటో పోస్ట్ చేసి...

Published : Dec 30, 2022, 02:17 PM IST

కొందరు వార్తల్లో నిలవడానికి, పబ్లిక్ అటెన్షన్ దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారతారు. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల్లా తీరు కూడా అలాగే కనిపిస్తోంది. కొన్నాళ్ల క్రితం ‘మిస్టర్ ఆర్‌పీ’ అంటూ రిషబ్ పంత్‌ కూడా సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఊర్వశి, అతను కారు ప్రమాదానికి గురైన సమయంలో కూడా తన పాడు బుద్దిని వదులుకోలేదు..

PREV
18
ఇలాంటి పరిస్థితుల్లోనూ రిషబ్ పంత్‌ని వదలని ఊర్వశి రౌతెల్లా... హాట్ ఫోటో పోస్ట్ చేసి...
Image: Urvashi Rautela, Rishabh Pant/Instagram

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంటే... ‘Praying... ’ (ప్రార్థిస్తున్నా...) అంటూ ఇన్‌స్టాలో ఓ ఫోటో పోస్టు చేసింది ఊర్వశి రౌతెల్లా. కాప్షన్ వరకూ బాగానే ఉంది కానీ దానికి పెట్టిన ఫోటోనే హాట్ టాపిక్ అయ్యింది...
 

28

దేవకన్య గెటప్‌లో హాట్‌గా చూస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన ఊర్వశి... దానికి ‘ప్రార్థిస్తున్నా’ అనే కాప్షన్ జోడించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు రిషబ్ పంత్ అభిమానులు...

38

ఊర్వశి, రిషబ్ పంత్ గురించి నిజంగా అంత బాధపడుతుంటే.. అతని ఫోటో పెట్టి, ఇలాంటి కాప్షన్ ఇచ్చి ఉంటే బాగుండేదని... కనీసం అలా చేసి ఉంటే కష్టకాలంలో అతను బాగుండాలని కోరుకుంటుందనే సానుభూతి అయినా ఆమెకు దక్కి ఉండేదని అంటున్నారు నెటిజన్లు...
 

48

ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పబ్లిసిటీ కోసం, క్రేజ్ కోసం ఊర్వశి రౌతెల్లా ఇలాంటి పనులు చేస్తోందని మరోసారి తేలిపోయిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.. 

58

తెలుగులో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని నటిస్తున్న సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో నటిస్తున్న ఊర్వశి రౌతెల్లా, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో నటించింది...
 

68

కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్‌ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో కారు ప్రమాదానికి గురైన రిషబ్ పంత్‌ని వెంటనే పక్కనే ఉన్న సాక్ష్యం మల్లీస్పెషాలిటీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ప్రయాణీకులు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం రిషబ్ పంత్‌ని డెహ్రాడూన్‌కి తరలించారు...

78
Rishabh Pant

డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాడు రిషబ్ పంత్. మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో రిషబ్ పంత్‌ మెలకువలోకి వచ్చాడని, వైద్యులతో మాట్లాడాడని సమాచారం. అతని తీసిన ఎక్స్‌రేలో ఎలాంటి ఎముక విరగలేదని, ఫ్రాక్చర్స్‌ ఏవీ లేవని తేలింది...

88
rishabh pant

తాజాగా బీసీసీఐ, రిషబ్ పంత్ ఆరోగ్య పరిస్థితి కూడా బులెటిన్ విడుదల చేసింది. రిషబ్ పంత్‌ నుదుటిన రెండు కాట్లు పడ్డాయని తెలియచేసిన బీసీసీఐ, కుడి మోకాలికి గాయమైందని తెలిపింది. అలాగే అతని కుడి మోచేతికి, పాదానికి, బొటనవేలికి కూడా గాయాలైనట్టు స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది బీసీసీఐ.

Read more Photos on
click me!

Recommended Stories