ధోనీ కూడా వరల్డ్ కప్స్‌ ఓడిపోయాడు! రోహిత్ కెప్టెన్సీపై ఇంకా నమ్మకముంది... గౌతమ్ గంభీర్ కామెంట్..

First Published Dec 30, 2022, 12:46 PM IST

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, భారీ అంచనాలతో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు. అయితే ఆ అంచనాలను అందుకోలేకపోయాడు రోహిత్ శర్మ. ఏడాది ముగిసే సరికి రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ పగ్గాలు హార్ధిక్ పాండ్యాకి అప్పగించేసినట్టు వార్తలు వస్తున్నాయి...

Image credit: Getty

కెప్టెన్‌గా స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని విజయాలు అందుకున్న టీమిండియా... ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో తేలిపోయింది... ఆసియా కప్‌లో ఫైనల్ కూడా చేరలేకపోయిన భారత జట్టు, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది...

Rohit Sharma and Gautam Gambhir

‘ఒక్క వరల్డ్ కప్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్‌ని తక్కువ చేయడానికి లేదు. అతనికి కెప్టెన్సీ స్కిల్స్ లేకపోతే ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ ఎలా గెలవగలిగాడు.

Latest Videos


Gautam Gambhir

మహేంద్ర సింగ్ ధోనీ కూడా నాలుగు వరల్డ్ కప్స్‌లో టైటిల్స్ సాధించలేకపోయాడు... అందుకని ధోనీ కెప్టెన్సీని తప్పుబట్టగలమా? రోహిత్ శర్మ కెప్టెన్సీ స్కిల్స్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. టీమ్‌లో చాలా మార్పులు జరిగాయి. ఏడాదిలో ఎంతో మంది ప్లేయర్లను మార్చారు. కెప్టెన్లను మార్చారు...

ఐసీసీ టైటిల్స్ గెలవాలంటే ఓ స్థిరమైన జట్టు కావాలి. ప్రతీ సిరీస్‌కోసారి ప్లేయర్లు బ్రేకులు తీసుకుంటూ ఉంటే టీమ్ ఎలా సెటిల్ అవుతుంది. వరల్డ్ కప్ ఆడాలనుకుంటే కోర్ టీమ్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వకూడదు... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్లు కూడా వరుసగా సిరీస్‌లు ఆడాల్సిందే...

Rohit Sharma

ఏ ప్లేయర్ అయినా ఒక్కటి రెండు సిరీస్‌లు ఆడిన తర్వాత రెస్ట్ కావాలంటే అతన్ని వరల్డ్ కప్ టీమ్ నుంచి తీసి పక్కనబెట్టండి. అతను రోహిత్ శర్మ అయినా, విరాట్ కోహ్లీ అయినా ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీ ఆడాలంటే టీమిండియా ఆడే అన్ని సిరీసుల్లో పాల్గొని తీరాల్సిందే...

కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తిరిగి టీ20ల్లో స్థానం దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. వాళ్లు కుర్రాళ్లతో పోటీపడి పరుగులు చేయగలిగితేనే పొట్టి ఫార్మాట్‌లో చోటు దక్కించుకోగలుగుతారు. రోహిత్‌ని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారని నేను అనుకోవడం లేదు..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

click me!