కారు ప్రమాదంలో రిషబ్ పంత్‌కి తీవ్ర గాయాలు... ఏడాది వరకూ రీఎంట్రీ కష్టమేనంటూ...

First Published Dec 30, 2022, 10:42 AM IST

టీమిండియాలో ఇప్పుడిప్పుడే స్టార్ ప్లేయర్‌గా ఎదుగుతున్నాడు రిషబ్ పంత్. స్టార్ క్రికెటర్‌గా ఎదుగుతున్న సమయంలో రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, రీఎంట్రీ ఇవ్వడానికి ఏడాదికి పైగా పడుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

Rishabh Pant

శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ సమీపంలో రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ యాక్సిడెంట్ తర్వాత కారు పరిస్థితి చూస్తే, ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. కనీస ఆనవాళ్లు కూడా తెలియకుండా 70 శాతానికి పైగా కాలి బూడిదైంది...

Rishabh Pant accident

ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌ తలకి తీవ్ర గాయమైంది. అలాగే కారు బలంగా డివైడర్‌ని ఢీకొట్టడంతో అతని వెన్నెముక, కాళ్లకు కూడా తీవ్రంగా గాయాలు తగిలాయి. ఈ గాయాల నుంచి పూర్తిగా కోలుకుని, మళ్లీ క్రికెట్‌ ఆడడం సాధ్యమేనా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..

Latest Videos


రిషబ్ పంత్ కోలుకోవడానికి ఎంత లేదన్నా ఏడాదికి పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు వైద్యులు. ఇదే జరిగితే వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలోనూ రిషబ్ పంత్ ఆడడం జరగదు. వన్డేల్లో మ్యాచ్ విన్నర్‌గా మారిన రిషబ్ పంత్ లేని లోటు టీమ్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉంది.. 

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కి ముందే రిషబ్ పంత్‌కి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సాహిస్తూ వచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్. ధోనీతో పోల్చి చూడడంతో కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కొన్న రిషబ్ పంత్... ఆస్ట్రేలియా టూర్‌ 2020-21 తర్వాత టీమిండియాకి ఆపద్భాంధవుడిలా మారిపోయాడు...

Rishabh Pant-Pujara

అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గబ్బా టెస్టుని గెలిపించిన రిషబ్ పంత్, ఈ ఏడాది టెస్టులు, వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. సౌతాఫ్రికాలో కేప్‌టౌన్‌లో సెంచరీ చేసిన రిషబ్ పంత్, బంగ్లాదేశ్ టూర్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌లు ఆడి టీమిండియాకి విజయాలు అందించాడు.. 

click me!