విరాట్ కోహ్లీ వల్లే అశ్విన్‌ని కాదని, రవీంద్ర జడేజాకి చోటు... ఇంగ్లాండ్ సిరీస్‌లో ఏం జరిగిందంటే...

Published : Dec 14, 2021, 12:16 PM IST

ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో, ఆ తర్వాత కౌంటీ మ్యాచ్‌లో చక్కని ప్రదర్శన ఇచ్చాడు భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అయితే అతనికి ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లోనూ అవకాశం దక్కలేదు...

PREV
113
విరాట్ కోహ్లీ వల్లే అశ్విన్‌ని కాదని, రవీంద్ర జడేజాకి చోటు... ఇంగ్లాండ్ సిరీస్‌లో ఏం జరిగిందంటే...

రెండో టెస్టులో అశ్విన్ ఉంటాడని, మూడో టెస్టులో కచ్ఛితంగా ఆడతాడని, నాలుగో టెస్టులో ఉండి తీరాల్సిందేనని క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు అంచనా వేసినా... భారత ప్రధాన స్పిన్నర్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు...

213

ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల్లో కలిపి నాలుగు వికెట్లు కూడా తీయలేకపోయిన రవీంద్ర జడేజాని మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు విరాట్ కోహ్లీ...

313

అప్పట్లో రవిచంద్రన్ అశ్విన్‌కీ, విరాట్ కోహ్లీకి గొడవ అయ్యిందని, సీనియర్ ప్లేయర్ అని కూడా చూడకుండా విరాట్ కోహ్లీ, అశ్విన్‌ను తిట్టి, పక్కనబెట్టాడని... ఈ అవమానాన్ని తట్టుకోలేక అశ్విన్, విరాట్ కోహ్లీపై బీసీసీఐకి ఫిర్యాదు చేశాడని కూడా వార్తలు చక్కర్లు చేశాయి...

413

ఈ వార్తలపై రవిచంద్రన్ అశ్విన్ స్వయంగా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. విరాట్ కోహ్లీతో గొడవలు లేవు, అతనిపై ఫిర్యాదు చేయలేదు, ఇలా ఎలా పుట్టిస్తారయ్యా సామీ... అంటూ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు అశ్విన్...

513

తాజాగా భారత మాజీ క్రికకెటర్, స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ‘అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి సీనియర్ స్పిన్నర్లు ఆడుతున్నప్పుడు భారత జట్టు పరిస్థితి వేరు...

613

టీమ్ మేనేజ్‌మెంట్ కచ్ఛితంగా స్పెషలిస్టు స్పిన్నర్లు జట్టులో ఉండాల్సిందేనని భావించేది. కాబట్టి అనిల్ కుంబ్లే, హర్భజన్ విదేశాల్లో కూడా ఆడేవాళ్లు...

713

వారికి విదేశాల్లో కూడా మంచి రికార్డు ఉండేది. ప్రత్యర్థి జట్టులో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ ఎక్కువ మంది ఉంటే హర్భజన్ సింగ్‌ను ఆడించేవాళ్లు, లేదంటే అనిల్ కుంబ్లే జట్టులో ఉండేవాడు...

813

అయితే ఇప్పుడు భారత జట్టు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విరాట్ కోహ్లీ భారత బ్యాటింగ్ ఆర్డర్‌ బలంగా ఉండేందుకు ఐదుగురు బ్యాటర్లు కావాలని అనుకుంటున్నాడు...

913

ఐదు బ్యాట్స్‌మెన్లు జట్టులో ఉండాలనుంటే రవీంద్ర జడేజా అదనపు ఛాయిస్ అవుతాడు. అతను వేగంగా పరుగులు చేయగలడు, ఏ పిచ్‌ మీదైనా పరుగులు చేయగలుగుతాడు...

1013

అందుకే రవీంద్ర జడేజా వికెట్లు తీయకపోయినా అతను విదేశాల్లో కీలక సభ్యుడిగా మారిపోయాడు. వికెట్లు తీయడం కంటే కూడా పరుగులను నియంత్రిస్తూ ఫాస్ట్ బౌలర్లపై వర్క్ లోడ్ పడకుండా జడ్డూని ఆడించాడు విరాట్ కోహ్లీ...

1113

భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగం ఇంతకుముందుకంటే ఇప్పుడు బాగా బలపడింది. అందుకే విదేశాల్లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాల్సిన అవసరం టీమిండియాకి లేకుండా పోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రజ్ఞాన్ ఓజా...

1213

డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, ఆ తర్వాత కౌంటీ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. అయినా అతను ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు...

1313

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ద్వారా నాలుగేళ్ల తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి వచ్చిన అశ్విన్, న్యూజిలాండ్‌తో జరిగిన టీ20, టెస్టు సిరీస్‌లోనూ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చి... ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ కూడా గెలిచాడు..

Read more Photos on
click me!

Recommended Stories