ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ పోస్టర్లు వైరల్... కెప్టెన్సీ పోయినా క్రేజ్ ఏ మాత్రం తగ్గలే...

First Published Sep 27, 2022, 3:25 PM IST

విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీల్లో విరాట్ కోహ్లీ ఒకడనే విషయం అందరికీ తెలుసు. అయితే సోషల్ మీడియాలోనే కాదు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో విరాట్ కోహ్లీ క్రేజ్ వేరే లెవెల్. తాజాగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ కోసం ఏర్పాట్లు చేస్తున్న ఆస్ట్రేలియా, ఆతిథ్య నగరాల్లో క్రికెటర్ల పోస్టర్లు ఏర్పాటు చేసింది...

Image credit: PTI

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు భారీ విరాట్ కోహ్లీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం బయట ఏర్పాటు చేసిన ఈ కటౌట్, మ్యాచ్‌కి వచ్చే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోనుంది... కోహ్లీ తప్ప మిగిలిన క్రికెటర్లను పట్టించుకోలేదు అక్కడి అభిమానులు...

ఇక్కడే అనుకుంటే ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌ సిటీలో ఏర్పాటు చేసిన విరాట్ కోహ్లీ పోస్టర్, క్రికెట్ టౌన్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాది ఆరంభంలో ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసిన సమయంలో కూడా విరాట్ కోహ్లీ ఫోటోనే వాడింది...
 

Image credit: PTI

ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా విరాట్ కోహ్లీయే డామినేట్ చేస్తున్నాడు. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా, వన్డే కెప్టెన్సీ కోల్పోయినా విరాట్ కోహ్లీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరి కదా రెండింతలు పెరిగింది...

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఐసీసీతో పాటు ఆస్ట్రేలియా కూడా పట్టించుకోకపోవడం ఆయన అభిమానులను తీవ్రంగా కలిచి వేస్తోంది. విరాట్‌కి పెట్టినట్టే భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ పోస్టర్లు ఏర్పాటు చేయాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం...

కెప్టెన్‌గా విజయాలు అందుకోవడంలో, పరుగులు చేయడంలో విరాట్ కోహ్లీతో ఎవ్వరైనా పోటీ పడొచ్చేమో కానీ క్రేజ్ విషయంలో మాత్రం ‘సామి శిఖరం’ అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

click me!