కెఎల్ రాహుల్ ఏం చేసినా టీమ్ కోసమే! ఆఖరికి అవుటైనా... సునీల్ గవాస్కర్ కామెంట్...

Published : Sep 27, 2022, 02:31 PM IST

గాయం నుంచి కోలుకున్న తర్వాత కెఎల్ రాహుల్ తిరిగి ఫామ్‌ అందుకోలేకపోతున్నాడు. ఆసియా కప్ 2022 టోర్నీలో ఆఫ్ఘాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన కెఎల్ రాహుల్, ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లోనూ రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయ్యాడు. ..

PREV
16
కెఎల్ రాహుల్ ఏం చేసినా టీమ్ కోసమే! ఆఖరికి అవుటైనా...  సునీల్ గవాస్కర్ కామెంట్...
KL Rahul

మొదటి టీ20లో 55 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, రెండో టీ20లో 10, మూడో టీ20లో 1 పరుగుకే పెవిలియన్ చేరాడు. మొత్తంగా మూడు టీ20ల్లో కలిపి కెఎల్ రాహుల్ చేసిన పరుగులు 66 మాత్రమే...

26
Rohit Sharma and KL Rahul

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్ రిథమ్‌లోకి రావడానికి చాలా సమయమే తీసుకునేలా కనిపిస్తుండడం టీమిండియా అభిమానులను కలవరబెడుతోంది. వరుసగా ఫెయిల్ అవుతున్న కెఎల్ రాహుల్‌ని తప్పించి, విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది..

36
Image credit: Getty

‘టీమ్‌కి ఏం కావాలో కెఎల్ రాహుల్‌కి బాగా తెలుసు. మొదటి టీ20లో కెఎల్ రాహుల్ చేసిన హాఫ్ సెంచరీ చాలా విలువైనది. రెండో మ్యాచ్‌లో అయితే మొదటి బంతికే రాహుల్ తన బ్యాటుకి పని చెప్పాడు. ఎందుకంటే అది 8 ఓవర్ల మ్యాచ్ అని అతని బాగా తెలుసు...

46
Image credit: Getty

తాను ఎక్కువ సేపు క్రీజులో ఉండడం కంటే త్వరగా అవుట్ కావడమే బెటర్ అని కెఎల్ రాహుల్ తెలుసుకున్నాడు. అందుకే తన వికెట్‌ని త్యాగం చేశాడు. అలాగే మూడో టీ20లో కూడా కావాల్సిన రన్ రేటు ఓవర్‌కి 9 పరుగులకంటే ఎక్కువగా ఉంది...

56

అది అంత తేలికైన విషయం కాదు. టీమ్‌కి శుభారంభం కావాలి. అందుకే అక్కడ కూడా తన వికెట్ త్యాగం చేశాడు కెఎల్ రాహుల్. విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. కోహ్లీలాగే కెఎల్ రాహుల్ కూడా చక్కని క్రికెట్ షాట్స్ ఆడతాడు...

66
KL Rahul

అయితే స్వింగ్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం రాహుల్‌కి కాస్త కష్టమైన పని. స్వింగ్ బాల్‌ని ఆడబోయి కెఎల్ రాహుల్ వికెట్ కోల్పోయాడు. ఎక్కువ డాట్ బాల్స్ ఆడలేని పరిస్థితి కాబట్టి అవుట్ అవుతానని తెలిసినా కెఎల్ రాహుల్ ఆ షాట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

click me!

Recommended Stories