INDvsENG: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్... బ్యాటింగ్ పిచ్‌పై కూడా.

Published : Mar 04, 2021, 03:55 PM IST

గత రెండు టెస్టుల్లో బ్యాటింగ్ వైఫల్యానికి పిచ్‌యే కారణమంటూ వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ జట్టు, బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పైన కూడా భారీ స్కోరు చేయలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టు 75.5 ఓవర్లలో 205 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బెన్ స్టోక్స్ హాఫ్ సెంచరీతో రాణించగా డానియల్ లారెన్స్ 46 పరుగులు చేశాడు..

PREV
110
INDvsENG: తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆలౌట్... బ్యాటింగ్ పిచ్‌పై కూడా.

గత రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ జట్టును ఇబ్బంది పెట్టిన అక్షర్ పటేల్, ఆరంభంలోనే రెండు వికెట్లు తీసి ఇబ్బంది పెట్టాడు. 8 బంతుల్లో 2 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు... అక్షర్ పటేల్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికే వికెట్ తీశాడు...

210

30 బంతుల్లో ఒక ఫోర్‌తో 9 పరుగులు చేసి జాక్ క్రావ్లే, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...

310

9 బంతుల్లో ఒక ఫోర్‌తో 5 పరుగులు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టును జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు.

410

నాలుగో వికెట్‌కి 48 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో 67 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసి బెయిర్ స్టో అవుట్ అయ్యాడు. 78 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్ జట్టు...

510

121 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన బెన్ స్టోక్స్, టెస్టుల్లో 24వ హాఫ్ సెంచరీ నమోదుచేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు బెన్ స్టోక్స్. 

610

87 బంతుల్లో 2 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఓల్లీ పోప్, అశ్విన్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బెన్ ఫోక్స్ కూడా ఒక్క పరుగుకే అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

710

74 బంతుల్లో 8 ఫోర్లతో 46 పరుగులు చేసిన డానియల్ లారెన్స్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 3 పరుగులు చేసి డొమినిక్ బేస్ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు...

810

189 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్‌కు అండర్సన్, జాక్ లీచ్ కలిసి 200+ మార్కుని దాటించారు. మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 578 పరుగుల తర్వాత ఐదు ఇన్నింగ్స్‌లకు మళ్లీ 200+ పరుగులు చేయగలిగింది ఇంగ్లాండ్ జట్టు. 

910

భారత బౌలర్లలో అశ్విన్ 3, అక్షర్ పటేల్ 4, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయగా వాషింగ్టన్ సుందర్‌కి ఓ వికెట్ దక్కింది. 

1010

ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాట్స్‌మెన్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం విశేషం...

click me!

Recommended Stories