రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ... ఆఖరి వన్డే వరల్డ్ కప్ ఆడబోతూ, మొదటి ప్రపంచ కప్ కోసం...

Published : Jul 01, 2023, 04:28 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి షెడ్యూల్ వచ్చేసింది. 12 ఏళ్ల తర్వాత ఇండియాలో జరగబోతున్న వన్డే ప్రపంచ కప్‌కి ఇంకా 3 నెలల సమయం మాత్రమే ఉంది. 2023 టోర్నీ చాలామంది ప్లేయర్లకు ఆఖరి వన్డే వరల్డ్ కప్ కానుంది..

PREV
19
రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ... ఆఖరి వన్డే వరల్డ్ కప్ ఆడబోతూ, మొదటి ప్రపంచ కప్ కోసం...
Image credit: Getty

రోహిత్ శర్మ: 36 ఏళ్ల రోహిత్ శర్మ, నాలుగేళ్ల తర్వాత జరిగే వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నీలో ఆడే అవకాశాలు అస్సలు లేవు. ఇప్పటికే బ్యాటింగ్‌లో మునుపటి కసి కోల్పోయిన రోహిత్ శర్మ, 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతాడని టాక్ వినబడుతోంది.

29
Image credit: Getty

2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ, 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలతో రికార్డు పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయితే టీమ్‌కి వరల్డ్ కప్ అందించలేకపోయాడు. టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ, మొట్టమొదటి వన్డే వరల్డ్ కప్‌ టైటిల్‌ని ఎత్తడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు..

39
Image credit: PTI

రవీంద్ర జడేజా: 34 ఏళ్ల రవీంద్ర జడేజా, అండర్19 ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2008 U19 వరల్డ్ కప్ గెలిచాడు. 2009లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన జడ్డూ, నిలకడ లేమి కారణంగా 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. మూడేళ్లుగా గాయాలతో తెగ ఇబ్బందిపడుతున్న జడేజా మరో నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడం కాస్త కష్టమే..
 

49
Image credit: PTI

మహ్మద్ షమీ: 32 ఏళ్ల మహ్మద్ షమీ, ఫిట్‌గా ఉంటే మరో నాలుగేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగగలడు. అయితే కుర్రాళ్ల రాకతో ఇప్పటికే టీ20ల్లో చోటు కోల్పోయిన మహ్మద్ షమీ, మరో నాలుగేళ్ల పాటు వన్డేల్లో కొనసాగడం మాత్రం కష్టమే. 2013లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన మహ్మద్ షమీ, టీమిండియాకి ప్రధాన బౌలర్. జస్ప్రిత్ బుమ్రా, ప్రపంచ కప్ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే షమీయే భారత ప్రధాన అస్త్రం అవుతాడు...

59
Shakib Al Hasan

షకీబ్ అల్ హసన్: 36 ఏళ్ల బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, దాదాపు కెరీర్ ఫినిషింగ్ స్టేజీకి చేరుకున్నాడు. షకీబ్ అల్ హసన్‌కి 2023 వన్డే వరల్డ్ కప్ ఆఖరి ప్రపంచ కప్ టోర్నీ కానుంది. 

69

ట్రెంట్ బౌల్ట్: 33 ఏళ్ల న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, ఫ్రాంఛైజీ క్రికెట్‌కి అందుబాటులో ఉండేందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్‌ 2023 టోర్నీలో న్యూజిలాండ్‌కి ట్రెంట్ బౌల్ట్ కీ బౌలర్. 2023 వన్డే వరల్డ్ కప్‌, బౌల్డ్‌కి ఆఖరి ప్రపంచ కప్ కావచ్చు. 

79
Image credit: Getty

కేన్ విలియంసన్: న్యూజిలాండ్ వన్డే, టీ20 కెప్టెన్ కేన్ విలియంసన్, ఐపీఎల్ 2023 సీజన్‌లో గాయపడి రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. కేన్ విలియంసన్, గాయం నుంచి కోలుకుంటే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడతాడు. 

89
Kane Williamson

ఇదే జరిగితే 2019 వన్డే వరల్డ్ కప్‌‌లో కెప్టెన్సీ చేసి, 2023 వన్డే వరల్డ్ కప్‌లో కెప్టెన్సీ చేసే ఏకైక సారథిగా నిలుస్తాడు కేన్. ఈ నాలుగేళ్లలో టీమిండియా కెప్టెన్‌తో పాటు మిగిలిన జట్ల కెప్టెన్లు అందరూ మారిపోయారు.

99

డేవిడ్ మిల్లర్: సౌతాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ప్రస్తుత వయసు 34 ఏళ్లు. 2010లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన డేవిడ్ మిల్లర్, 2015 వన్డే వరల్డ్ కప్‌లో 324 పరుగులు చేశాడు. 155 వన్డేలు, 114 టీ20 మ్యాచులు ఆడిన డేవిడ్ మిల్లర్, 2023 వన్డే వరల్డ్ కప్‌లో సౌతాఫ్రికాకి కీ బ్యాటర్‌గా మారబోతున్నాడు.. 
 

Read more Photos on
click me!

Recommended Stories