ఇప్పుడు రోహిత్‌కి అసలైన ఛాలెంజ్ అదే... ఐపీఎల్ 2022, టీ20 వరల్డ్‌ కప్ మధ్యలో...

Published : Feb 22, 2022, 07:13 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్ ఆడిన భారత జట్టు, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది. సఫారీ టూర్ నుంచి రాగానే వెస్టిండీస్‌తో సిరీస్ ఆడిన టీమిండియా, శ్రీలంకతో సిరీస్ ఆడనుంది. 

PREV
18
ఇప్పుడు రోహిత్‌కి అసలైన ఛాలెంజ్ అదే... ఐపీఎల్ 2022, టీ20 వరల్డ్‌ కప్ మధ్యలో...

శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత రెండున్నర నెలల పాటు ఐపీఎల్ మ్యాచులతో బిజీగా గడపబోతున్నారు భారత క్రికెటర్లు...

28

ఐపీఎల్ ముగిసిన తర్వాత వారం గ్యాప్‌లో సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్, అది ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ టూర్... ఇలా భారత క్రికెట్ జట్టు షెడ్యూల్‌లో గ్యాపులే లేవు...

38

‘ఇప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందున్న అతిపెద్ద లక్ష్యం ప్లేయర్లు ఫిట్‌గా, మెజర్ మ్యాచులకు అందుబాటులో ఉండేలా చూసుకోవడమే...

48

ఎందుకంటే భారత క్రికెట్ జట్టు, వచ్చే ఏడాదిన్నర మొత్తం ఫుల్ ప్యాక్ క్రికెట్ ఆడనుంది. ఐపీఎల్‌తో పాటు అనేక సిరీస్‌లు, టూర్‌లు ఉన్నాయి...

58

రెండున్నర నెలల పాటు ఐపీఎల్ ఆడిన తర్వాత సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచులు ఆడాలి. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్, ఐదు మ్యాచుల టీ20 సిరీస్...

68

ఇలాంటి బిజీ షెడ్యూల్‌లో ఆటగాళ్లు మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండేలా చూసుకోవడం అంత తేలికైన విషయం కాదు...

78

టీ20 వరల్డ్ కప్ టోర్నీకి మేజర్ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం చాలా అవసరం. రోహిత్ శర్మతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

88

రెండు రోజుల క్రితం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగించుకున్న భారత జట్టు, మరో రెండు రోజుల్లో (24 ఫిబ్రవరి నుంచి) శ్రీలంకతో టీ20 సిరీస్‌లో పాల్గొనబోతోంది...

click me!

Recommended Stories