రాహుల్ ద్రావిడ్ స్థానంలో రవిశాస్త్రి ఉండి ఉంటేనా... వృద్ధిమాన్ సాహా ఎపిసోడ్‌పై...

Published : Feb 22, 2022, 05:23 PM IST

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2022 సీజన్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్న సాహా, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కి ఎంపిక కాకపోవడంతో చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేశాయి...

PREV
110
రాహుల్ ద్రావిడ్ స్థానంలో రవిశాస్త్రి ఉండి ఉంటేనా... వృద్ధిమాన్ సాహా ఎపిసోడ్‌పై...

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, తనని రిటైర్ అవ్వాల్సిందిగా సూచించాడని వృద్ధిమాన్ సాహా చేసిన కామెంట్లు, క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకి దారి తీశాయి...

210

అయితే ఈ ఎపిసోడ్‌లో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు...

310

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్పాన్ పఠాన్ కూడా టీమిండియా హెడ్ కోచ్, భారత మాజీ కెప్టెన్, క్రికెటర్ రాహుల్ ద్రావిడ్‌ చేసిన పనినే సమర్థించాడు...

410

రాహుల్ ద్రావిడ్ కూడా పరిస్థితి చేయిదాటక ముందే వృద్ధిమాన్ సాహాను బాధపెట్టాలనే ఉద్దేశంతో అలా చెప్పలేదని వివరణ ఇచ్చి, రాద్ధాంతం కాకుండా జాగ్రత్త పడ్డాడు...

510

‘ఓ సమర్థుడైన, నిజాయితీ గల కోచ్‌‌కి ప్లేయర్‌ ఫిట్‌గా లేడని తెలిస్తే, అతను ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేడని అర్థం చేసుకుంటే రిటైర్మెంట్ తీసుకొమ్మని సలహా ఇచ్చే అధికారం ఉంది... ఇందులో నాకైతే తప్పేమీ కనిపించడం లేదు... ’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...
 

610

అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం హెడ్ కోచ్ పొజిషన్‌లో చాలామందికి మెచ్చిన, నచ్చిన క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు కాబట్టి ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని కొట్టేస్తున్నారు...

710

రాహుల్ ద్రావిడ్ స్థానంలో రవి శాస్త్రి ఉండి ఉంటే, సాహాని రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించినందుకు పెద్ద రచ్చ జరిగేదని అంటున్నారు...

810

అలాగే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కూడా కెరీర్‌ను ఒకే సారి మొదలెట్టి, ఒకేసారి ముగించారు...

910

గంగూలీ, ద్రావిడ్ మంచి ఫ్రెండ్స్ కావడం వల్లే టీమిండియా ప్లేయర్ల విషయంలో ఏం చేసినా కుదురుతోందని, ఇప్పుడు వాళ్లు ఆడిందే ఆటగా సాగుతోందని విమర్శిస్తున్నారు...

1010

విజయాలు వస్తున్నవరకూ ఏం చేసినా సాగుతుంది... పరాజయాలు ఎదురైనప్పుడు రాహుల్ ద్రావిడ్‌తో పాటు సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మకూడా రవి శాస్త్రిలా ట్రోలింగ్‌ను ఫేస్ చేయాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు మరికొందరు ఫ్యాన్స్...

click me!

Recommended Stories