ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఉందా? లేదా? వాళ్లేమో అలా, వీళ్లేమో ఇలా...

Published : Feb 22, 2022, 06:28 PM IST

వెస్టిండీస్‌ టీ20, వన్డే సిరీస్ ముగించుకున్న భారత జట్టు, మరో రెండు రోజుల్లో శ్రీలంకతో టీ20, టెస్టు సిరీస్ ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం లంక సిరీస్ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది...

PREV
110
ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్‌తో వన్డే సిరీస్ ఉందా? లేదా? వాళ్లేమో అలా, వీళ్లేమో ఇలా...

2022 ఏడాదికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు, మార్చి నెలలో భారత పర్యటనలో మూడు వన్డేల సిరీస్ ఆడబోతున్నట్టు ప్రకటించింది...

210

అయితే టీమిండియా షెడ్యూల్‌లో మాత్రం ఆఫ్ఘాన్ సిరీస్‌ కోసం టైమ్ లేనట్టే కనిపిస్తోంది. ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక- భారత్ సిరీస్‌ మార్చి 16 వరకూ సాగుతుంది...

310

ఫిబ్రవరి 24 నుంచి 27 వరకూ మూడు టీ20 మ్యాచులు ఆడే భారత జట్టు, ఆ తర్వాత మార్చి 4 నుంచి తొలి టెస్టు, మార్చి 12 నుంచి రెండో టెస్టు ఆడుతుంది...
 

410

సీనియర్లు శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో బిజీగా ఉంటే, మరో జట్టుతో ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌‌ను పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పటిదాకా బీసీసీఐ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు...

510

శ్రీలంకతో వన్డే, టెస్టు సిరీస్‌లకు జట్లను కూడా ప్రకటించిన బీసీసీఐ, ఆఫ్ఘానిస్తాన్‌తో వన్డే సిరీస్ ఉంటుందా? వాయిదా పడిందా? అనే విషయం కూడా చెప్పలేదు... 

610

ఈ ఏడాది మార్చి 25-27 తేదీల నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభమవుతుందని అంచనా. 
10 ఫ్రాంఛైజీలు పాల్గొనబోతుండడంతో ఐపీఎల్ 2022 సీజన్‌ను వారం ముందుగానే ప్రారంభించాలని భావిస్తోంది బీసీసీఐ...

710

ఇదే నిజం అయితే శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లకు మిగిలి ఉండే సమయం కేవలం 12-13 రోజులు మాత్రమే...

810

ఈ గ్యాప్‌లో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు క్యాంపులను నిర్వహించి, ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనేందుకు ప్లేయర్లు అందుబాటులో ఉండాలని బీసీసీఐని కోరతాయి...

910

ఎలా చూసుకున్నా ఆఫ్ఘాన్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఇప్పట్లో జరగడం కష్టమే. ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికా, ఇంగ్లాండ్‌లతో సిరీస్‌లు ఆడుతుంది భారత జట్టు...

1010

ఎలా చూసినా ఆగస్టు నెల వరకూ భారత క్రికెట్ జట్టు డైరీలో ఖాళీలు లేవు. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో ఆసియా కప్ నిర్వహిస్తే... అక్కడ కూడా భారత క్రికెటర్లు బిజీగా గడుపుతారు. భారత్‌లో పర్యటించాలన్న ఆఫ్ఘాన్ ఆశలు ఇప్పట్లో నెరవేరడం కష్టమే...

Read more Photos on
click me!

Recommended Stories