పింక్ బాల్ టెస్ట్: ఇంగ్లాండ్ స్కోరుకి 13 పరుగుల దూరంలో టీమిండియా... విరాట్ కోహ్లీ వికెట్ పడకుంటే...

First Published | Feb 24, 2021, 10:18 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు భారత జట్టు పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసిన టీమిండియా, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి 13 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజులో రోహిత్ శర్మ, అజింకా రహానే ఉన్నారు. తొలి రోజు ఆట ముగిసే ముందు వేసిన ఆఖరి ఓవర్‌లో విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోయింది భారత జట్టు. కోహ్లీ వికెట్ పడకపోయి ఉంటే, భారత జట్టు పింక్ బాల్ టెస్టులో పూర్తి పట్టు సాధించేది. 

శుబ్‌మన్ గిల్ 11 పరుగులు చేసి ఆర్చర్ బౌలింగ్‌‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. 33 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...
టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా, జాక్ లీచ్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. నాలుగో బంతికే పెవిలియన్ చేరిన పూజారా డకౌట్ కావడంతో 34 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది టీమిండియా.

58 బంతుల్లో 3 ఫోర్లతో 27 పరుగులు చేసిన భారత సారథి విరాట్ కోహ్లీ, జాక్ లీచ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కోహ్లీ, జాక్ లీచ్ బౌలింగ్‌లో అవుట్ కావడం ఇదే తొలిసారి.
34 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియాను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 64 పరుగులు జోడించి ఆదుకున్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచులను అందుకోవడంలో ఇంగ్లాండ్ ఫీల్డర్ ఓల్లీ పోప్ ఫెయిల్ కావడంతో ఇద్దరూ అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నారు.
రోహిత్ శర్మ 82 బంతుల్లో 9 ఫోర్లతో 57 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనితో పాటు అజింకా రహానే 3 బంతుల్లో 1 పరుగు చేశాడు.మూడో రోజు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది టీమిండియా...
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకి 13 పరుగుల దూరంలో నిలిచింది భారత జట్టు. టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు... 48.4 ఓవర్లలో 112 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రావ్లే 84 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసి, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
జో రూట్ 17, బెన్ ఫోక్స్ 12, జోఫ్రా ఆర్చర్ 11 పరుగులు చేయగా మిగిలిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఎవ్వరూ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 21.4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు...
రవిచంద్రన్ అశ్విన్ 16 ఓవర్లు బౌలింగ్ చేసి 26 పరుగలిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మకు ఓ వికెట్ దక్కింది...
ఇంగ్లాండ్ బౌలర్లలో తొలి రోజు జాక్ లీచ్‌కి రెండు వికెట్లు దక్కగా, జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ తీశాడు. రెండో రోజు ఆట మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించబోతోంది...

Latest Videos

click me!