పింక్ బాల్ టెస్టు: ఇంగ్లాండ్‌ను తిప్పేసిన భారత స్పిన్నర్లు... ఫ్లడ్‌లైట్ల వెలుతురులో మనోళ్ల బ్యాటింగ్...
First Published | Feb 24, 2021, 6:22 PM ISTపింక్ బాల్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 112 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోని ఇంగ్లాండ్, పరుగులకే ఆలౌట్ అయ్యింది. అక్షర్ పటేల్ ఆరు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. రెండో సెషన్‌లోనే ఇంగ్లాండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా, ఫ్లడ్ లైట్ల వెలుతురులో బ్యాటింగ్ చేయనుంది.