క్రికెట్‌ ప్రపంచంలో డబుల్ స్పెషల్ డే... సచిన్ టెండూల్కర్, ధోనీ, క్రిస్‌గేల్‌ చారిత్రక ఇన్నింగ్స్‌కి...

First Published Feb 24, 2021, 3:49 PM IST

ఫిబ్రవరి 24... క్రికెట్ ప్రపంచంలో ఈరోజు చాలా స్పెషాలిటీ ఉంది. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌తో పాటు ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ చారిత్రక ఇన్నింగ్స్‌లకి సాక్ష్యంగా మిగిలింది ఫిబ్రవరి 24...

వన్డేల్లో డబుల్ సెంచరీ సాధ్యమైనా? అని క్రికెట్ విశ్లేషకులు చర్చించుకున్న సమయంలో... అద్వితీయమైన ఇన్నింగ్స్‌లో సరికొత్త చరిత్రకి శ్రీకారం చుట్టాడు సచిన్ టెండూల్కర్...
undefined
2010, ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో ద్విశతకం సాధించి, ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి క్రికెటర్‌గా నిలిచాడు సచిన్ టెండూల్కర్...
undefined
సచిన్ టెండూల్కర్‌ డబుల్ సెంచరీకి ముందు సయ్యద్ అన్వర్ సాధించిన 194 పరుగులే వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ ఓ వన్డేలో 183 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
undefined
సచిన్ టెండూల్కర్ 198 పరుగుల బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మొత్తం టీవీలకు అతుక్కుపోయారు.
undefined
స్పోర్ట్స్ ఛానెళ్లతో పాటు జెమినీ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెళ్లలో కూడా ప్రసారమవుతున్న ప్రోగ్రామ్‌కి బ్రేక్ ఇచ్చి సచిన్ బ్యాటింగ్‌కి చూపించడం ఇప్పటికీ ఓ రికార్డు...
undefined
సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి చేరువైన సమయంలో ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్‌కి ఏకంగా 5.5 మిలియన్ల యూజర్లు ఓపెన్ చేశారు. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది...
undefined
టెండూల్కర్ డబుల్ సెంచరీకి చేరువైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ బౌండరీలు బాదుతూ, సచిన్‌కి పెద్దగా స్ట్రైయిక్ ఇవ్వకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సచిన్ టెండూల్కర్‌కి డబుల్ సెంచరీ పూర్తిచేసుకునే అవకాశం దక్కుతుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు ఆఖరి ఓవర్‌లో సచిన్‌కి డబుల్ సెంచరీ మార్కు అందుకే అవకాశం దక్కింది...
undefined
సచిన్ వన్డే డబుల్ సెంచరీ తర్వాత మూడేళ్లకు 2013, ఫిబ్రవరి 24న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో చెలరేగాడు మహేంద్ర సింగ్ ధోనీ.
undefined
224 పరుగులు చేసిన ధోనీ, టెస్టుల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరుతో పాటు ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారత వికెట్‌ కీపర్‌గా నిలిచాడు...
undefined
ధోనీ రికార్డు నెలకొల్పిన రెండేళ్లకు అంటే 2015, ఫిబ్రవరి 24న వన్డే వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై 215 పరుగులు చేసి డబుల్ సెంచరీ బాదాడు యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్. వరల్డ్‌కప్‌లో డబుల్ సెంచరీ బాదిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు క్రిస్‌గేల్... గేల్‌కి వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు...
undefined
click me!