ధోనీని అప్పుడే అవుట్ చేయాల్సింది, కానీ... అవేశ్ ఖాన్ కామెంట్...

First Published Apr 12, 2021, 6:42 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కొత్త కుర్రాళ్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్ అదరగొట్టగా, రెండో మ్యాచ్‌లో ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు...

ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న సీనియర్ పేసర్లు ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ ఉన్నప్పటికీ... అవేశ్ ఖాన్‌కు తుదిజట్టులో అవకాశం దక్కింది. ఇషాంత్ శర్మ గాయం కారణంగా దూరం కావడంతో ఆవేశ్ ఖాన్‌కి ఎంట్రీ లభించింది...
undefined
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో అదరగొట్టిన అవేశ్ ఖాన్, ఐదు మ్యాచుల్లో 14 వికెట్లు తీసి సంచలనం క్రియేట్ చేసింది... ఈ పర్ఫామెన్స్ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లోనే అతనికి అవకాశం దక్కింది...
undefined
‘మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ తీయాలనేది నాకున్న అది పెద్ద డ్రీమ్... మూడేళ్ల క్రితమే 2018లో మహేంద్ర సింగ్ ధోనీని అవుట్ చేసే అవకాశం వచ్చింది...
undefined
అయితే ధోనీ ఇచ్చిన క్యాచ్‌ను కోలిన్ మున్రో వదిలేయడంతో ఆ అవకాశం మిస్ అయ్యింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత నాకు అవకాశం రావడం, ధోనీని బౌల్డ్ చేయడంతో నా సంతోషానికి హద్దులు లేవు...
undefined
మహీ భాయ్, చాలా రోజులుగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. ఆయన వికెట్ తీయడానికి ఇది కూడా ఓ కారణం. మొదటి మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడితో ఉంటారని గ్రహించాను...
undefined
మాహీ వికెట్ ఎలా తీయాలనేదానిపై మ్యాచ్‌కి ముందే చాలా పక్కాగా ప్లాన్ చేశాం... అది వర్కవుట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆవేశ్ ఖాన్...
undefined
ఐపీఎల్ 2020 తర్వాత మళ్లీ 2021 సీజన్‌లోనే బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మొదటి మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న రెండో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...
undefined
మాహీతో పాటు గత సీజన్‌లో ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా అవుట్ చేసిన ఆవేశ్ ఖాన్, రెండు వికెట్లు పడగొట్టి మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
undefined
మొత్తంగా ఐపీఎల్ కెరీర్‌లో 10 మ్యాచులు ఆడిన ఆవేశ్ ఖాన్, 7 వికెట్లు తీశాడు. 2018 సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన ఆవేశ్ ఖాన్, 4 వికెట్లు తీసినా... ఆ తర్వాత అతనికి పెద్దగా అవకాశం దక్కలేదు...
undefined
click me!