రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్... రాహుల్ తెవాటియా సిక్సర్ల మోత రిపీట్ అవుతుందా...

First Published Apr 12, 2021, 6:05 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో భఆగంగా నేడు రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత, బౌండరీల వర్షం కురిసింది. దాంతో ఈ రోజు మ్యాచ్‌పై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి...

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అప్పటిదాకా ఏ జట్టూ చేధించని టార్గెట్ అది...
undefined
మయాంక్ అగర్వాల్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేయగా, కెఎల్ రాహుల్ 54 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 69 పరుగులు చేశాడు... ఆఖర్లో పూరన్ 8 బంతుల్లో 3 సిక్సర్లతో, ఓ ఫోర్‌తో 25 పరుగులు చేశాడు...
undefined
224 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్, బట్లర్ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు బట్లర్...
undefined
స్టీవ్ స్మిత్ 27 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 50 పరుగులు చేయగా సంజూ శాంసన్ 42 బంతుల్లో 4 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 85 పరుగులు చేశాడు...
undefined
స్టీవ్ స్మిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ తెవాటియా... మొదట సింగిల్స్ తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఫలితంగా రాజస్థాన్ రాయల్స్ విజయానికి చివరి 5 ఓవర్లలో 89 పరుగులు కావాల్సిన క్లిష్ట పరిస్థితికి చేరుకుంది...
undefined
సంజూ శాంసన్ అవుట్ కావడం, ఓ వైపు రాహుల్ తెవాటియా 19 బంతుల్లో 8 పరుగులే చేసి క్రీజులో ఉండడంతో మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది రాజస్థాన్ రాయల్స్...
undefined
అయితే అప్పుడే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు రాహుల్ తెవాటియా.... కాట్రెల్ వేసిన 18వ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది 30 పరుగులు రాబట్టాడు...
undefined
దీంతో మ్యాచ్‌పై తిరిగి పట్టు సాధించింది రాజస్థాన్ రాయల్స్. ఆర్చర్ రెండు సిక్సర్లు బాదడంతో 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది... ఇప్పటిదాకా ఐపీఎల్‌లో అత్యధిక లక్ష్యచేధన ఇదే...
undefined
ఐపీఎల్ 2021 సీజన్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్‌ను ఎలా నడిపిస్తాడనేది నేటి మ్యాచ్‌తో తేలనుంది. కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌ల మధ్య పోటీ ఇంట్రెస్టింగ్‌గా మారనుంది.
undefined
ఇప్పటిదాకా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య 21 మ్యాచులు జరగగా, 9 మ్యాచుల్లో పంజాబ్ గెలిచింది. 12 మ్యాచుల్లో రాజస్థాన్‌కి విజయం దక్కింది...
undefined
click me!