గబ్బర్ కెరీర్ నాశనం చేయాలని చూస్తున్న మాజీ భార్య.. కోర్టు ఆగ్రహం

First Published | Feb 6, 2023, 12:20 PM IST

Shikhar Dhawan: గబ్బర్  కెరీర్  ను  సమూలంగా నాశనం చేసేందుకు ఆమె కంకణం కట్టుకుందని,  ధావన్ తరఫున  తన న్యాయవాది కోర్టులో  ఆరోపణలు చేశారు.  

టీమిండియా  వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్  మాజీ భార్య  అయేషా ముఖర్జీ మరోసారి వార్తల్లో  నిలిచింది.  గబ్బర్  కెరీర్  ను  సమూలంగా నాశనం చేసేందుకు ఆమె కంకణం కట్టుకుందని,  ధావన్ తరఫున  తన న్యాయవాది కోర్టులో  ఆరోపణలు చేశారు.   అయేషా ఆగడాల నుంచి తనను కాపాడాలని ఆయన  ఢిల్లీలోని పాటియాలా కోర్టును ఆశ్రయించాడు. 

వివరాల్లోకెళ్తే.. రెండేండ్ల క్రితమే  ఈ ఇద్దరూ విడిపోయారు.  చట్టపరంగా విడాకులు కూడా తీసుకున్నారు. అయేషాకు ధావన్ నెలనెలా భరణం కూడా చెల్లిస్తున్నాడు. అయితే  అయేషా మాత్రం  ధావన్ ప్రతిష్టకు భంగ కలిగేలా వ్యవహరిస్తున్నదని  అతడి తరఫున  న్యాయవాది తెలిపాడు. 
 


ఇదే విషయమై  పాటియాలా కోర్టులో గత బుధవారం వాదనలు కూడా ముగిసాయి. అయేషా..  ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఓనర్లలో ఒకడైన  ధీరజ్ మల్హోత్రాకు ధావన్  గురించి ఉన్నవీ లేనివి కల్పించి చెబుతున్నదని  ధావన్  న్యాయవాది కోర్టుకు విన్నవించాడు.  అయేషా.. ధావన్ ప్రతిష్టకు భంగం కలిగేలా చేస్తున్నదని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

విచారణలో భాగంగా  పాటియాలా కోర్టు న్యాయమూర్తి  హరీస్ కుమార్... ‘వ్యక్తిగత ప్రతిష్ట వ్యక్తికి సంబంధించిన అత్యంత కీలక అంశం.  ఏదైనా వస్తువో, ఆస్తినో  కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చు గానీ  ప్రతిష్ట అలా కాదు. దానిని రక్షించాల్సిన అవసరం ఉంది...’అని అన్నారు. 

అయేషా ఇకమీదట ధావన్  గురించి, ముఖ్యంగా తన ప్రతిష్టకు భంగం కలిగించేవాటిలో స్నేహితులు, కుటుంబసభ్యులు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియాల ప్రసారం చేయకూడదని  కోర్టు ఆదేశించింది.   
 

అయితే అయేషా ఇదివరకే  చాలా మందికి  ధావన్  ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించిందని  గబ్బర్ స్నేహితులు, కుటుంబసభ్యులు,  క్రికెట్ అధికారులకు  ఫోన్లు చేయడం, ధావన్ గురించి వారి వద్ద  చెడుగా చెప్పడం చేసిందని కూడా  అతడి లాయర్ వాపోయాడు.  డబ్బుకోసమే అయేషా ఇలా చేస్తుందని ఆయన ఆరోపించాడు.  అయేషా నుంచి విడిపోయాక  ధావన్ ఆమెకు నెలకు   17,500 ఆస్ట్రేలియన్ డాలర్లను చెల్లిస్తున్నాడు.  

Latest Videos

click me!