Vaibhav Suryavanshi: బౌలింగ్ చేయడం కష్టం.. ఏం బ్యాటింగ్ సామీ అది.. వైభవ్ తుపాన్‌ అంతే.. !

Published : May 28, 2026, 12:48 PM IST

Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పనైపోయింది. ఓటమిపై కెప్టెన్ ప్యాట్ కమిన్స్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

PREV
14
వైభవ్ రేపిన పరుగుల సునామీ.. ఆరెంజ్ ఆర్మీ ఖేల్‌ఖతం

ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) కథ ముగిసింది. ముల్లన్‌పూర్‌లో బుధవారం రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన డూ-ఆర్-డై ఫైట్‌లో ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రాజస్థాన్ విధించిన 244 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేదించలేక 19.2 ఓవర్లలో 196 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ సెన్సేషన్, వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు, 12 సిక్సర్లతో 97 పరుగులు చేసి సన్‌రైజర్స్ బౌలింగ్ లైనప్‌ను పూర్తిగా సర్వనాశనం చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయినా, మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. బంతితో జోఫ్రా ఆర్చర్ (3/58) నిప్పులు చెరగడంతో రాజస్థాన్ క్వాలిఫయర్-2కు దూసుకెళ్లగా, హైదరాబాద్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయింది.

24
వైభవ్‌కు బౌలింగ్ చేయడం నెక్స్ట్ లెవెల్ కష్టం: ప్యాట్ కమిన్స్

ఈ షాకింగ్ ఓటమి అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌పై కమిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. "మేం ఏం ప్లాన్ చేసినా వైభవ్ దగ్గర దానికి కౌంటర్ ఆన్సర్ రెడీగా ఉంది. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా భయం లేకుండా ఫేస్ చేశాడు" అని ప్యాట్ కమిన్స్ అన్నాడు.

"వైభవ్ నిజంగా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశాడు. ఆ పిల్లాడికి ఎక్కడ బౌలింగ్ చేయాలో కూడా మాకు ఆప్షన్లు కనిపించలేదు. అతడిని అవుట్ చేయడానికి మేం వేసిన ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇది ప్యూర్ బ్యాటింగ్ పిచ్.. బౌలర్లు యార్కర్ వేయడంలో కాస్త లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయినా వైభవ్ అస్సలు వదిలిపెట్టలేదు. ప్రతి బాల్‌ను బౌండరీ అవతలకు పంపడమే టార్గెట్‌గా ఆడాడు. అంత చిన్న వయసులో ఆ తెగింపు, కసి చూస్తుంటే ముచ్చటేస్తోంది. అతడి ఆటతీరును మెచ్చుకోకుండా ఉండలేం" అని కమిన్స్ అన్నాడు.

34
ఛేదనలో తడబడిన హైదరాబాద్.. చేతులెత్తేసిన స్టార్ హిట్టర్లు

244 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్‌కు స్టార్టింగ్ లోనే గట్టి షాక్ తగిలింది. పవర్‌ఫుల్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) ఇన్నింగ్స్ రెండో బంతికే డకౌట్ కాగా, వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ (33) కాసేపు మెరుపులు మెరిపించాడు. కానీ జోఫ్రా ఆర్చర్ వేసిన మూడో ఓవర్లో ఇషాన్ కూడా పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత ట్రావిస్ హెడ్ (17), క్లాసెన్ (18) కూడా ఫెయిల్ అవ్వడంతో హైదరాబాద్ టీమ్ 57 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. నితీష్ కుమార్ (38), సలీల్ అరోరా (35) ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించి ఆశలు రేపినా.. జడేజా, సుశాంత్ మిశ్రా కీలక సమయంలో వికెట్లు తీసి SRH ఆశలపై నీళ్లు చల్లారు. చివర్లో శివాంగ్ (27) పోరాడినా ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాడు.

44
నాకౌట్ అయినా.. మా ప్లేయర్లపై గర్వంగా ఉంది

టోర్నీ నుంచి అవుట్ అయినా తమ జట్టు ప్రదర్శన పట్ల కమిన్స్ సానుకూలంగా స్పందించాడు. "ఈ సీజన్‌లో టోర్నీ నుంచి ఎగ్జిట్ అవ్వడం బాధగా ఉన్నా.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ఈసారి సీజన్‌లో మా యంగ్ ప్లేయర్స్ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించాం. ప్రఫుల్ హింగే (3 వికెట్లు), సాకిబ్ హుస్సేన్ లాంటి కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. 240 ప్లస్ టార్గెట్ కొట్టాలంటే కొద్దిగా లక్ కూడా కావాలి, కానీ క్రూషియల్ టైమ్‌లో వికెట్లు పడిపోయాయి. అయినప్పటికీ మా వాళ్లు లాస్ట్ మినిట్ వరకు ఫైట్ చేశారు. గత మూడేళ్లలో మేం రెండుసార్లు ప్లే ఆఫ్స్ చేరాం. ఈ సీజన్‌లో మా టీమ్ పర్ఫామెన్స్ చూసి గర్వపడుతున్నా. యంగ్ ప్లేయర్లు ప్రెజర్ లేకుండా గేమ్ ఎంజాయ్ చేశారు" అని కమిన్స్ అన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories