విరిగిన వేలుతోనే బౌలింగ్ చేస్తూ, వరల్డ్ నెం.1 బౌలర్‌గా... - ఆసీస్ పేసర్ ప్యాట్ కమ్మిన్స్...

First Published May 8, 2021, 11:43 AM IST

ప్యాట్ కమ్మిన్స్... వరల్డ్ నెం.1 టెస్టు బౌలర్. ఆస్ట్రేలియా ఫ్యూచర్ కెప్టెన్‌గా గుర్తింపు పొందుతున్న ప్యాట్ కమ్మిన్స్... 28వ పుట్టినరోజు నేడు. ఐపీఎల్ 2020 వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన ప్యాట్ కమ్మిన్స్, 2021 సీజన్‌లో కరోనా బాధితులకు విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచాడు.

ప్యాట్ కమ్మిన్స్... 133 మ్యాచుల్లో 312 వికెట్లు తీసి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో దూసుకుపోతున్న ఆసీస్ పేసర్. ఆసీస్ టూర్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ను తెగ ఇబ్బంది పెట్టిన ప్యాట్ కమ్మిన్స్‌కి నిజానికి ఓ వేలు సగమే ఉంటుంది.
undefined
ప్యాట్ కమ్మిన్స్ చిన్నతనంలో జరిగిన ఓ గాయం కారణంగా కుడి చేతి మధ్య వేలు తెగిపోయింది. ఈ గాయం కారణంగా కొన్నేళ్ల పాటు క్రికెట్‌కి దూరంగా గడిపాడు ప్యాట్ కమ్మిన్స్...
undefined
అయితే ఆట మీద తనకున్న ఇష్టం, బంతిని వదిలిపెట్టనివ్వలేదు. మధ్యవేలు లేకపోయినా రెండు వేళ్లతో బంతిని ఒడిసిపట్టుకుని, స్వింగ్ చేయడంపై ఫోకస్ పెట్టాడు.
undefined
ప్యాట్ కమ్మిన్స్ ప్రయత్నం ఫలించింది. మధ్య వేలు పూర్తిగా బంతిని తాకలేకపోయినా రెండు వేళ్లతో నిప్పులు చెరిగే బంతులు వేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు కమ్మిన్స్...
undefined
ఐపీఎల్ 2020 వేలంలో రూ.15 కోట్ల 50 లక్షల భారీ ప్రైజ్ దక్కించుకున్నాడు ప్యాట్ కమ్మిన్స్... 14 మ్యాచుల్లో 12 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ రాణించి ఓ హాఫ్ సెంచరీతో 146 పరుగులు చేశాడు.
undefined
2021 సీజన్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 66 పరుగులు... సీజన్‌లో హైలెట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది...
undefined
2018 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో 196 వికెట్లు తీసిన ప్యాట్ కమ్మిన్స్, గత మూడేళ్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.
undefined
2019 ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్న ప్యాట్ కమ్మిన్స్, ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే...
undefined
జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన ప్యాట్ కమ్మిన్స్... కరోనా బాధితుల కోసం 50 వేల డాలర్లు విరాళం ప్రకటించి అందరి మనసులు గెలుచుకున్నాడు.
undefined
click me!