భువనేశ్వర్ కుమార్, పృథ్వీషా, కుల్దీప్‌లను ఎందుకు ఎంపిక చేయలేదు... టీమిండియా సెలక్షన్‌పై అభిమానుల నిరాశ...

Published : May 08, 2021, 09:48 AM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌ టూర్‌లో ఆడబోయే ఐదు టెస్టుల సిరీస్‌కి కూడా భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. 20 మంది ప్లేయర్లు, నలుగురు స్టాండ్‌బై ప్లేయర్లతో కూడిన ఈ జట్టులో భువీ, పృథ్వీషా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు దక్కలేదు...

PREV
111
భువనేశ్వర్ కుమార్, పృథ్వీషా, కుల్దీప్‌లను ఎందుకు ఎంపిక చేయలేదు... టీమిండియా సెలక్షన్‌పై అభిమానుల నిరాశ...

ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ మొత్తానికి దూరమయ్యాడు. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో అదిరిపోయే స్పెల్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు.

211

దాంతో స్వింగ్‌కి అద్భుతంగా సహకరించే ఇంగ్లాండ్ పిచ్‌లపై భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తాడని, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతను టీమిండియాకు ఆయుధంగా మారతాడని భావించారంతా...

311

అయితే బీసీసీఐ ప్రకటించిన జట్టులో భువనేశ్వర్ కుమార్ పేరు లేదు. దీనికి కారణం ఐపీఎల్ 2021 సీజన్‌లో మరోసారి గాయపడ్డాడు భువనేశ్వర్ కుమార్. గాయం కారణంగా రెండు మ్యాచులకు దూరమయ్యాడు...

411

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చినప్పటికీ భువీ, 100 శాతం ఫిట్‌గా లేడని కనిపించింది. అందుకే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌ టూర్‌లోనూ భువీకి చోటు దక్కలేదు...

511

ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిలైడ్ టెస్టులో ఆడిన యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషా... మొదటి ఇన్నింగ్స్‌లో మూడో బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. ఆ తర్వాత అతను టీమిండియాలో చోటు కోల్పోయాడు.

611

అయితే విజయ్ హాజారే ట్రోఫీలో 800+ పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేసిన పృథ్వీషా, ఆ తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ అదరగొట్టాడు. 

711

ఈ పర్ఫామెన్స్‌తో పృథ్వీషాకి భారత టెస్టు జట్టులో మరోసారి అవకాశం రావొచ్చని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు. అయితే సెలక్టర్లు అతన్ని పట్టించుకోకుండా పక్కనపెట్టేశారు...

811

ఇప్పటికే శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ రూపంలో రోహిత్ శర్మకు తోడుగా ముగ్గురు ఓపెనర్లు ఉండడంతో పృథ్వీషాను ఎంపిక చేసి, మరోసారి రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడలేదు బీసీసీఐ.

911

విదేశీ పిచ్‌లపై అద్భుతంగా రాణించి, రికార్డులు క్రియేట్ చేసిన కుల్దీప్ యాదవ్‌కి ఈ మధ్య అసలు పొజిషనే బాగోలేదు. ఐపీఎల్ 2020 సీజన్‌లో పట్టుమని 13 ఓవర్లు కూడా బౌలింగ్ చేయలేకపోయిన కుల్దీప్, ఆ తర్వాత ఆసీస్ టూర్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

1011

ఇంగ్లాండ్‌తో టెస్టుల్లో రెండు మ్యాచులు ఆడినా, అతనికి ఇచ్చిన ఓవర్లు చాలా తక్కువ. ఆ తర్వాత వన్డే సిరీస్‌లో రెండు మ్యాచుల్లో దక్కిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు కుల్దీప్.

1111

ఈ పర్ఫామెన్స్‌తో కుల్దీప్ యాదవ్‌ను పక్కనపెట్టేసింది టీమిండియా. అదీకాక అక్షర్ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉండడం, రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకోవడంతో కుల్దీప్ యాదవ్‌కి జట్టులో చోటు దక్కలేదు...

click me!

Recommended Stories