వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి భారత జట్టు ప్రకటన... ఆ యంగ్ సెన్సేషన్ ప్లేయర్‌కి దక్కని చోటు...

First Published May 7, 2021, 6:44 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం 20 మందితో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. ముందుగా 30 మందితో కూడిన జంబో జట్టు ఇంగ్లాండ్ చేరి ప్రాక్టీస్ చేస్తుందని భావించినా... కేవలం 20 మందితో కూడిన జట్టును మాత్రమే ప్రకటించి, స్టాండ్‌బై ప్లేయర్లుగా మరో నలుగురికి అవకాశం ఇచ్చారు సెలక్టర్లు. జూన్ 2న వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ చేరే ఈ జట్టు, న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ ముగిశాక అక్కడే ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా అజింకా రహానే వైస్ కెప్టెన్‌గా వ్యవహారిస్తారు.
undefined
ఓపెనర్లుగా రోహిత్ శర్మతో పాటు శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్‌కి చోటు దక్కింది...
undefined
టెస్టు స్పెషలిస్టు ప్లేయర్లు ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారిలకు అవకాశం ఇచ్చారు సెలక్టర్లు.
undefined
ఆస్ట్రేలియా టూర్ నుంచి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్ వికెట్ కీపర్‌గా వ్యవహారించబోతున్నారు.
undefined
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌... స్పిన్ విభాగాన్ని మోయబోతున్నారు...
undefined
బుమ్రా, ఇషాంత్ వర్మ, మహ్మద్ షమీ, సిరాజ్, శార్దల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్... పేస్ విభాగాన్ని లీడ్ చేస్తారు..
undefined
వీరితో పాటు కెఎల్ రాహుల్, వృద్దిమాన్ సాహాలను కూడా ఎంపిక చేసిన సెలక్టర్లు, వీరి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ను బట్టి తుదిజట్టులో ఉంటారని తేల్చారు...
undefined
విజయ్ హాజారే ట్రోఫీ నుంచి బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యంగ్ సెన్సేషనల్ ప్లేయర్ పృథ్వీషాకి టెస్టు జట్టులో చోటు దక్కుతుందని భావించినా, అతనికి నిరాశే ఎదురైంది.
undefined
ఐపీఎల్2021 సీజన్‌లో అదరగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ, ఆవేశ్ ఖాన్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్, అర్జాన్ నాగస్‌వాలాలకు స్టాండ్‌బై ప్లేయర్లుగా జట్టులో చోటు దక్కింది.
undefined
భారత జట్టు ఇది: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింకా రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పూజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, ఇషాంత్ శర్మ, సిరాజ్, షమీ, శార్దూల్ ఉమేశ్...కెఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా (ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ బట్టి)
undefined
click me!