వన్డే వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్తాన్ వేషాలు... టీమ్ కంటే ముందు భారత్‌లో పాక్ సెక్యూరిటీ బలగాలు...

Published : Jul 01, 2023, 05:36 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఇండియాలో జరుగుతుండడాన్ని పాక్ అస్సలు ఓర్వలేకపోతోంది. ఇండియాలో వరల్డ్ కప్ జరిగినా వాళ్లు పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదేమో కానీ పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్‌‌లో ఆడడానికి టీమిండియా నిరాకరించడంతో భారత్‌పై బురద చల్లేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది...

PREV
17
వన్డే వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్తాన్ వేషాలు... టీమ్ కంటే ముందు భారత్‌లో పాక్ సెక్యూరిటీ బలగాలు...
India vs Pakistan

2021 టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు న్యూజిలాండ్ టీమ్, పాక్ పర్యటనకి వెళ్లింది. కివీస్ టీమ్, పాక్‌లో అడుగుపెట్టడానికి ముందే ఓ సెక్యూరిటీ టీమ్, అక్కడ తనిఖీలు చేసి భద్రతా క్లియరెన్సులు కూడా ఇచ్చింది. అయితే సిరీస్ ఆరంభానికి ముందు కొన్ని గంటల ముందు భద్రతా కారణాలతో న్యూజిలాండ్ టీమ్ వెనక్కి వెళ్లిపోయింది..

27

న్యూజిలాండ్ టీమ్ తర్వాత రావాల్సిన ఇంగ్లాండ్ టీమ్ కూడా ఇదే కారణంగా పాకిస్తాన్‌లో అడుగుపెట్టలేదు. ఆ తర్వాతి ఏడాది పరిస్థితి కాస్త మారి ఈ రెండు జట్లు, పాకిస్తాన్‌లో టెస్టు సిరీస్ కూడా ఆడాయి..

37

అలాంటి పాకిస్తాన్, ఇండియాలో ఆడడానికి భద్రతా కారణాలను సాకుగా చూపుతోంది. భారత్‌లో మా టీమ్‌కి భద్రత ఉండదని ఐసీసీకి నివేదించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఓ సెక్యూరిటీ టీమ్‌ని ఇండియాకి పంపి, పాక్ మ్యాచులు ఆడే నగరాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీలు చేయడానికి అనుమతులు తీసుకుంది..

47

‘ప్రస్తుతం పీసీబీ కొత్త ప్రెసిడెంట్ ఎన్నిక జరగనుంది. అది జరిగిన తర్వాత పాక్ క్రికెట్ బోర్డు తరుపున కొందరు సెక్యూరిటీ అధికారులు, ఇండియాకి వెళ్తారు. పాకిస్తాన్ ఏయే నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులు ఆడబోతోందో అక్కడ సెక్యూరిటీ, ఇతర ఏర్పాట్లను పరిశీలించి వస్తారు..’ అంటూ పీసీబీ అధికారి తెలియచేశారు..

57
India vs Pakistan

2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత 2016 టీ20 వరల్డ్ కప్ కోసం ఇండియాకి వచ్చిన పాకిస్తాన్ క్రికెట్ టీమ్, ఏడేళ్ల తర్వాత మళ్లీ భారత్‌లో అడుగుపెట్టబోతోంది. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఇండియానే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా అది యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే..

67

2016 టీ20 వరల్డ్ కప్ సమయంలో కూడా పాక్ సెక్యూరిటీ అధికారులు, భారత్‌లో పర్యటించారు. షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉండగా పాక్ సెక్యూరిటీ టీమ్ సిఫారసులతో ఆ మ్యాచ్ కోల్‌కత్తాకి మారింది.. 

77

2023 వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ తొలుత అంగీకరించకపోయినా, ఆ తర్వాత రాజీకి వచ్చినట్టు సమాచారం.. 

click me!

Recommended Stories