శార్దూల్ ఠాకూర్ మెరుపు హాఫ్ సెంచరీ... వీరబాదుడుతో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్...

Published : Sep 02, 2021, 09:40 PM IST

127 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన టీమిండియా... మహా అయితే 150 పరుగులు చేసి ఆలౌట్ అయిపోతుందని అనుకున్నారంతా. ఆదుకుంటాడనుకున్న అజింకా రహానే స్వల్ప స్కోరుకే అవుటైనా, మెరుపులు మెరిపిస్తాడని అనుకున్న రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయినా శార్దూల్ మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు...

PREV
114
శార్దూల్ ఠాకూర్ మెరుపు హాఫ్ సెంచరీ... వీరబాదుడుతో వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ్రేక్...

31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్, ఇంగ్లాండ్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ అందుకున్న బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...

214

ఇంతకుముందుకు 1986లో ఇయాన్ బోథమ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకోవడమే ఇప్పటిదాకా రికార్డుగా ఉండేది. 35 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు శార్దూల్ ఠాకూర్...

314

ఓవరాల్‌గా టీమిండియా తరుపున మూడో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇది. కపిల్‌దేవ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదుచేయగా, వీరేంద్ర సెహ్వాగ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 

414

ఆస్ట్రేలియాలో గబ్బాలో హాఫ్ సెంచరీ బాదిన శార్దూల్ ఠాకూర్, ఇంగ్లాండ్‌లోనూ హాఫ్ సెంచరీ చేయడ విశేషం. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ కలసి 41 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదారు.

514

36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించనా, రివ్యూకి వెళ్లిన ఇంగ్లాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది.

614

36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన శార్దూల్ ఠాకూర్, క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించనా, రివ్యూకి వెళ్లిన ఇంగ్లాండ్‌కి అనుకూలంగా ఫలితం దక్కింది.

714

అంతకుముందు రోహిత్ శర్మ 11 పరుగులు చేసి క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 28 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. 
అదే స్కోరు వద్ద 17 పరుగులు చేసిన కెఎల్ రాహుల్ కూడా అవుట్ కాగా... పూజారా 4 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు...

814

39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో నాలుగో వికెట్‌కి 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు జడేజా, కోహ్లీ...  మరోవైపు 22 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. క్రిస్‌వోక్స్ బౌలింగ్‌లో కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను జో రూట్ అందుకోలేకపోయాడు...

914

బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొంది, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రవీంద్ర జడేజా... 34 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జో రూట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

1014

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింకా రహానే, క్రిస్‌వోలక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయినట్టు ప్రకటించాడు అంపైర్. అయితే రివ్యూకి వెళ్లిన భారత జట్టుకి అనుకూలంగా ఫలితం దక్కింది.

1114

69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది టీమిండయా. ఈ దశలో కోహ్లీ, రహానే కలిసి ఐదో వికెట్‌కి 36 పరుగులు జోడించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా 96 బంతుల్లో 8 ఫోర్లతో 50 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, రాబిన్‌సన్ బౌలింగ్‌లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

1214

విరాట్ కోహ్లీకి ఇది టెస్టుల్లో 27వ హాఫ్ సెంచరీ కాగా, సేనా దేశాల్లో 23వ హాఫ్ సెంచరీ. సచిన్ టెండూల్కర్ 40, రాహుల్ ద్రావిడ్ 27 మాత్రమే విరాట్ కోహ్లీ కంటే ముందున్నారు...
27 ఇన్నింగ్స్‌ల తర్వాత టెస్టుల్లో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. కెప్టెన్‌గా విరాట్ కోహ్లకి ఇది ఇంగ్లాండ్‌లో ఏడో హాఫ్ సెంచరీ...

1314

విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత అజింకా రహానే కూడా 47 బంతుల్లో ఒకే ఫోర్‌తో 14 పరుగులు చేసి, ఓవర్టన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

1414

ఆదుకుంటాడని అనుకున్న రిషబ్ పంత్ 33 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసి... ఓవర్టన్ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కి ప్రయత్నించి మొయిన ఆలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

click me!

Recommended Stories