సిరీస్ పోయిన బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో షాక్.. ఉన్న ఒక్క పేసర్‌కూ గాయం..

First Published Dec 14, 2022, 1:37 PM IST

PAKvsENG: స్వదేశంలో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోల్పోయిన  పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. ఆ జట్టు పేస్ బౌలింగ్ విభాగంలో కీలక  ప్లేయర్లంతా గాయాల బారీన పడుతున్నారు. 

టీ20 ప్రపంచకప్ లో అదృష్టం కొద్దీ ఫైనల్ చేరి తుదిపోరులో ఇంగ్లాండ్ చేతిలో  దారుణంగా ఓడిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆ టోర్నీ తర్వాత ఏదీ కలిసిరావడం లేదు.  ఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిన ఆ జట్టుకు స్వదేశంలో కూడా అదే ప్రత్యర్థి చేతిలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

బజ్ బాల్ ఆటతో ఇంగ్లాండ్ పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నది.   రావల్పిండితో పాటు ముల్తాన్ లో కూడా  అగ్రెసివ్ ఆట అంటే ఎలా ఉంటుందో రుచి చూపించింది.  వరుసగా రెండు టెస్టులు ఓడిన పాకిస్తాన్ సిరీస్ ను 2-0తో కోల్పోయింది.

అసలే సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న  పాకిస్తాన్ మూడో టెస్టు జరిగే కరాచీలో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నది. కానీ  ఆ జట్టుకు  మూడో టెస్టుకు ముందే మూడింది.  పాక్ ప్రధాన పేసర్ నసీమ్ షా గాయం కారణంగా ఈ టెస్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం అతడు కరాచీలోని నేషనల్ హై ఫర్ఫార్మెన్స్ సెంటర్ లో ఉన్నాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది.  ఇప్పటికే సిరీస్ కోల్పోయిన పాక్ కు ఇది కోలుకోలేని ఎదురుదెబ్బే.

17 ఏండ్ల తర్వాత తమ దేశానికి వచ్చిన ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ఆడుతున్న పాకిస్తాన్ కు ఈ సిరీస్ లో ఏదీ కలిసిరాలేదు.  ఆ జట్టు ప్రధాన బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రిది.. సిరీస్ ప్రారంభానికి ముందే గాయపడి మొత్తం మూడు మ్యాచ్ లకూ దూరమయ్యాడు. ఇక తొలి టెస్టులో  ఆడిన హరీస్ రౌఫ్ కూడా రెండో టెస్టుకు ముందే గాయపడ్డాడు.

తొలి టెస్టులో బౌలింగ్ లో ఫర్వాలేదనిపించిన నసీమ్ షా  రావల్పిండి టెస్టులో చివరి రోజు బ్యాటింగ్ లో కూడా  పోరాడి జట్టును  ఓటమి నుంచి తప్పించే యత్నం చేశాడు. కానీ  ఆ టెస్టులో గాయం కారణంగా రెండో టెస్టులో ఆడలేదు. దీంతో  పాకిస్తాన్.. అంతగా అనుభవం లేని  అష్రఫ్, మహ్మద్ అలీలతో నెట్టుకొచ్చింది. ఈ ఇద్దరూ రెండో టెస్టులో విఫలమయ్యారు.

కానీ స్పిన్నర్ అబ్రర్ అహ్మద్ స్పిన్ మాయతో  పాక్ బతికిపోయింది.  ఈ టెస్టులో  యువ స్పిన్నర్ తొలి ఇన్నింగ్స్ లో 7 రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి  ఇంగ్లాండ్ ను దెబ్బతీశాడు.  కానీ పాక్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమై  మ్యాచ్ ను చేజేతులా కోల్పోయింది.

click me!