ఐపీఎల్ ఆడేందుకు పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ మాస్టర్ ప్లాన్... ఇంగ్లాండ్ పౌరసత్వం కోసం అప్లై...

Published : May 13, 2021, 10:38 AM IST

కొన్నాళ్ల క్రితం అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ పేసర్ మహ్మద్ అమీర్... ఐపీఎల్‌లో పాల్గొనేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనేందుకు పాక్ క్రికెటర్లకు అనుమతి లేకపోవడంతో ఇంగ్లాండ్ పౌరసత్వం కోసం అప్లై చేశాడు అమీర్...

PREV
110
ఐపీఎల్ ఆడేందుకు పాక్ క్రికెటర్ మహ్మద్ అమీర్ మాస్టర్ ప్లాన్... ఇంగ్లాండ్ పౌరసత్వం కోసం అప్లై...

36 టెస్టులు ఆడిన మహ్మద్ అమీర్ 119 వికెట్లు తీయగా 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20 మ్యాచుల్లో 59 వికెట్లు పడగొట్టాడు. పాక్ క్రికెట్ జట్టులో అద్భుతమైన పేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమీర్, గత ఏడాది అర్ధాంతరంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

210

వాస్తవానికి తాను కేవలం టెస్టుల నుంచి తప్పుకోవాలని భావించానని అయితే పాక్ సెలక్టర్లు తనని అవమానించి, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకునేలా చేశారంటూ ఆరోపించాడు అమీర్. పాక్ జట్టులో జరిగే అవినీతి, అవకతవకలపై తీవ్ర ఆరోపణలు చేశాడు అమీర్...

310

‘పాక్ ప్లేయర్లు చాలా తెలివైనవాళ్లు. జట్టులో చోటు కోసం వయసు పదేళ్లు తగ్గించి చూపిస్తారు. బర్త్ సర్టిఫికెట్ల ప్రకారం పాక్ పేసర్ల వయసు 17, 18 ఏళ్లే ఉంటుంది. కానీ నిజానికి వారి వయసు పదేళ్లు ఎక్కువగానే ఉంటుంది... వయసు పైబడిన తర్వాత జట్టులోకి వచ్చిన వీళ్లు సుదీర్ఘమైన బౌలింగ్ స్పెల్స్ వేయలేరు... ’ అంటూ పాక్ క్రికెటర్లపై, పాక్ బోర్డుపై తీవ్ర ఆరోపణలు చేశాడు అమీర్...

410

అమెరికన్ క్రికెట్ లీగ్‌లో పాల్గొనేందుకు అమీర్ ఇంత త్వరగా అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడని ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆ సిరీస్ కరోనా కారణంగా వాయిదా పడడంతో తాజాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట అమీర్...

510

‘భారత జట్టు యువ ఆటగాళ్లను ప్రోత్సాహించేందుకు ఐపీఎల్‌ను చక్కగా వాడుకుంటోంది. ఆ జట్టు రిజర్వు బెంచ్‌ను చూస్తుంటే ఈ విషయం అర్థం అవుతోంది. ఇండియాతో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు...

610

యువకులను గుర్తించి, వారిని అంతర్జాతీయ స్థాయిల్లో ఆడేందుకు మానసికంగా, టెక్నికల్‌గా సిద్ధం చేస్తున్నాయి ఆ జట్లు. జూనియర్ స్థాయితో పాటు ఐపీఎల్‌ ఆడేందుకు చిన్నవయసులోనే అవకాశం రావడం వల్ల వాళ్లు ఆరంగ్రేటం నుంచే అద్భుతాలు చేస్తున్నారు...

710

ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువకుల ఫస్ట్ మ్యాచులను చూడండి. అసలు ఆరంగ్రేటం మ్యాచు ఆడుతున్నట్టుగా ఉండడడం లేదు. 

810

ఐపీఎల్‌లో స్టార్ క్రికెటర్లతో ఆడడం వల్ల యువకులు రాటుతేలుతన్నారు. పాక్‌లో మాత్రం యువకులకు అలాంటి ఛాన్స్ దొరకడం లేదు. అంతర్జాతీయ టీమ్‌లోకి వచ్చిన తర్వాత కోచ్‌ల వద్ద స్కిల్స్‌ నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతోంది...’ అంటూ వ్యాఖ్యానించాడు మహ్మద్ అమీర్.

910

ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీ ఫైనల్‌లో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను అవుట్ చేసిన మహ్మద్ అమీర్, ఆ మ్యాచ్‌లో పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

1010

మహ్మద్ అమీర్ ఇంగ్లాండ్ దేశ పౌరసత్వం సంపాదిస్తే, 2022 ఐపీఎల్ వేలంలో చోటు దక్కించుకునే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉన్న వైరం కారణంగా అమీర్‌ను కొనుగోలు చేయడానికి ఏ జట్టు సాహసం చేస్తుందో చూడాలి.

click me!

Recommended Stories