బుమ్రాకి జోకులు అస్సలు నచ్చవు, జోక్‌ చేసినా ఫీలైపోతాడు... మహ్మద్ షమీ కామెంట్...

Published : May 11, 2021, 04:21 PM IST

ఒకప్పుడు భారత పేస్ బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా ఉండేది. మన పేసర్లు బక్క పల్చగా ఉండడం చూసి, పాక్, ఆసీస్ క్రికెటర్లు నవ్వుతూ హేళన చేసేవారు కూడా. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్ వంటి పేసర్లతో ప్రపంచంలోనే బెస్ట్ ఫాస్ట్ బౌలర్లు మన జట్టులో ఉన్నారు. 

PREV
18
బుమ్రాకి జోకులు అస్సలు నచ్చవు, జోక్‌ చేసినా ఫీలైపోతాడు... మహ్మద్ షమీ కామెంట్...

తాజాగా భారత పేసర్ మహ్మద్ షమీ, భారత జట్టులో పేస్ బౌలర్ల మధ్య ఉన్న అనుబంధం గురించి ఓపెన్ అయ్యాడు. జట్టులో ఉన్న మిగిలిన ప్లేయర్లు ఎలా ఉంటారనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

28

‘మేం చాలా సరదాగా ఉంటాం. ఒకరిపైన ఒకరం జోకులు వేసుకుంటూ ఉంటాం. కానీ బుమ్రా మాత్రం కాస్త డిఫరెండ్ పర్సన్. అతనికి జోకులు పెద్దగా నచ్చవు. కొన్నిసార్లు సరదాకి అన్న మాటలను కూడా సీరియస్‌గా తీసుకుంటూ ఉంటాడు.

38

కానీ ఉమేశ్, భువనేశ్వర్, ఇషాంత్ శర్మ... మేం మాత్రం చాలా ఫన్నీగా ఉంటాం. మేం కలిశామంటే అంతే... గోల గోల చేస్తాం... భారత జట్టుకు కొన్నేళ్లుగా ఆడుతుండడం వల్ల మా మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది...

48

మేం బౌలింగ్ చేసేటప్పుడు కూడా అలాంటి ప్లానింగ్‌తోనే బరిలో దిగుతాం. మరో ఎండ్‌ నుంచి బౌలింగ్ చేసేవారికి సపోర్ట్ ఉండేలా అటాక్ చేస్తాం. ఏ బౌలర్ అయినా ఇబ్బంది పడుతుంటే, మరో ఎండ్ నుంచి బ్యాట్స్‌మెన్‌పై ప్రెషర్ పెట్టేందుకు పయత్నిస్తాం...

58

బుమ్రా నుంచి నా దగ్గర మేమంతా బ్యాట్స్‌మెన్‌ను అటాక్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తాం. డిఫెన్సివ్ బౌలింగ్ మాకు ఏ మాత్రం నచ్చదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు మహ్మద్ షమీ...

68

మహ్మద్ షమీ బౌలింగ్ చేసేటప్పుడు మిడ్ ఆన్‌లో ఫీల్డర్ తప్పనిసరిగా ఉండాల్సిందే... ‘మిడాన్‌లో ఎవరు ఉన్నా సరే, బంతి వస్తే అందుకోవడానికి రెఢీగా ఉండాలి. నేను ప్రతీ మీటింగ్‌లో చెప్పే విషయం ఇదే...’ అంటూ చెప్పాడు షమీ...

78

న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతున్న టీమిండియా... ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. గత ఏడాది నవంబర్‌లో ఆడిలైడ్‌లో చివరిసారిగా టెస్టు మ్యాచ్ ఆడిన షమీ, ఆ మ్యాచ్‌లో 36/9 స్కోరు వద్ద గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

88

ఆ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్న మహ్మద్ షమీ, ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. 8 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన షమీ, పంజాబ్ కింగ్స్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

click me!

Recommended Stories