టీమిండియాకి ఛాన్సే లేదు! ఈసారి కూడా గెలిచేది మేమే... పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్...

Published : Aug 19, 2022, 11:45 AM IST

గత ఏడాది యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీల్లో మొట్టమొదటిసారి భారత్‌పై విజయాన్ని అందుకుంది పాకిస్తాన్. అంతకుముందు వరల్డ్ కప్ ట్రోఫీల్లో ఎప్పుడూ టీమిండియాపై గెలవని పాక్, ఈ విజయాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈసారి కూడా తమదే విజయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడు పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్...

PREV
17
టీమిండియాకి ఛాన్సే లేదు! ఈసారి కూడా గెలిచేది మేమే... పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్...

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా ఆగస్టు 28న దాయాది పాకిస్తాన్‌తో తలబడనుంది టీమిండియా. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఈ రెండు జట్లు తలబడిన యూఏఈలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది...

27

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టైటిల్ ఫెవరెట్‌గా టీ20 వరల్డ్ కప్ 2021 బరిలో దిగిన భారత జట్టు, 10 వికెట్ల తేడాతో చిత్తుగా పరాజయం పాలైంది. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ వికెట్లను త్వరత్వరగా కోల్పోవడం టీమిండియాపై తీవ్రంగా ప్రభావం చూపించింది...

37
Babar Azam

జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి టాప్ క్లాస్ భారత బౌలర్లు ఎవ్వరూ కూడా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. మ్యాచ్ సాగిన 17 ఓవర్లలో టీమిండియాకి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్...

47

‘టోర్నీలో ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడూ టీమ్‌పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఆసియా కప్ 2022లో మేం మొదటి మ్యాచ్ టీమిండియాతో ఆడుతున్నాం. గత మ్యాచ్‌లో వాళ్లను 10 వికెట్ల తేడాతో ఓడించాం. ఆ విజయోత్సాహం టీమ్‌లో ఇంకా మిగిలే ఉంది...

57

అదీకాకుండా గత ఏడాది భారత్‌ని ఎక్కడైతే ఓడించామో అక్కడే ఈ మ్యాచ్ జరగుతోంది. కాబట్టి టీమిండియాకి ఛాన్సే లేదు. వాళ్లు గత మ్యాచ్ ఓటమి ఒత్తిడిలో ఉంటుంది. ఈసారి కూడా మేమే గెలుస్తాం... 

67
babar

ఇక్కడ మేం పీఎస్‌ఎల్ ఆడాం, చాలా హోం సిరీస్‌లు కూడా ఆడాం. యూఏఈ పరిస్థితులు మాకు బాగా అలవాటు. వాళ్లు ఇక్కడ ఐపీఎల్ ఆడినా, ఈ పరిస్థితులు వారికి పెద్దగా అలవాటు లేవు... 

77
Shaheen Afridi-Virat Kohli

ఇండియా వరుస విజయలు అందుకుంటోంది. అయితే మేం కొన్నాళ్లుగా టీ20ల్లో అద్భుతంగా ఆడుతున్నాం. వాళ్ల టీమ్‌లో కంటే మా టీమ్‌లో ప్లేయర్లు ఫిట్‌గా, ఫామ్‌లో ఉన్నారు...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్...

click me!

Recommended Stories