ఐపీఎల్ 2023 సీజన్ ట్రేడింగ్ విండోలో రవీంద్ర జడేజా... సీఎస్‌కేకి గుడ్‌బై, ఆర్‌సీబీలోకి జడ్డూ!...

First Published Aug 19, 2022, 10:17 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ని డేవిడ్ వార్నర్ ఎలాగైతే ఎప్పటికీ మరిచిపోలేడో, 2022 సీజన్‌ని రవీంద్ర జడేజా జీవితంలో మరిచిపోలేడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి 2016 సీజన్‌లో టైటిల్ అందించి, మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లలో ఒకటిగా నిలిపిన డేవిడ్ వార్నర్‌ని ఎస్‌ఆర్‌హెచ్ ఘోరంగా అవమానించి సాగనంపితే, మాహీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న జడ్డూ... ఆ బాధ్యతల నుంచి తొలగించబడి.. ఇప్పుడు ఏకంగా టీమ్‌ మారేందుకే సిద్ధమవుతున్నాడు...

jadeja

ఐపీఎల్ 2023 సీజన్‌కి సంబంధించిన ట్రేడింగ్ విండో నవంబర్ 2022లో ఓపెన్ కానుంది. ప్లేయర్లను మార్చుకోవాలని అనుకోనే ఫ్రాంఛైజీలు, మార్పులు చేర్పులు చేసుకోవడంతో పాటు మినీ వేలంలో ఏ ప్లేయర్లు పాల్గొనబోతున్నారో నవంబర్‌- డిసెంబర్ మాసాల్లో క్లారిటీ రానుంది...

Ravindra Jadeja

ఈసారి ట్రేడింగ్‌లో రవీంద్ర జడేజా ఉండబోతున్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. 11 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న జడేజా, 2023 సీజన్‌లో వేరే ఫ్రాంఛైజీ తరుపున ఆడబోతున్నాడని గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి...

Latest Videos


ఆర్‌సీబీ జట్టు, రవీంద్ర జడేజాని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి, ఒంటి చేత్తో మ్యాచులు గెలిపించగల జడేజా, వేలంలోకి వస్తే 10కి 9 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తాయి.. 

2022 ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌తో రవీంద్ర జడేజా టచ్‌లో లేడు. ఆ ఫ్రాంఛైజీకి సంబంధించిన ఫోటోలు, పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించిన జడ్డూ... అప్పుడెప్పుడో ‘మరో 10 ఏళ్లు సీఎస్‌కేలో ఉంటా...’ అంటూ చేసిన కామెంట్‌ని కూడా డిలీట్ చేశాడు.

Ravindra Jadeja

దీంతో రవీంద్ర జడేజా ఈసారి ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఉండబోతున్నాడా? లేక అంతకుముందే ట్రేడింగ్ విండోలో మరో ఫ్రాంఛైజీకి వెళ్లబోతున్నాడా? అనేది ఆసక్తికరంగా మారింది. 100కి 99 శాతం జడ్డూ, ఐపీఎల్ 2023లో సీఎస్‌కేకి ఆడకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

jadeja csk

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో రవీంద్ర జడేజాకి కెప్టెన్సీ పగ్గాలు అందించింది చెన్నై సూపర్ కింగ్స్... ఎప్పటి నుంచో మాహీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ తానేనంటూ చాటింపు వేసుకున్న జడ్డూ... బోలెడన్ని ఆశలతో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు...

అయితే మొదటి 8 మ్యాచుల్లో కేవలం రెండే రెండు మ్యాచుల్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. జడ్డూ కెప్టెన్ అయినా నామమాత్రపు సారథిగానే మిగిలాడు. ఆన్ ఫీల్డ్ తతంగమంతా ఎంఎస్ ధోనీయే నడిపించేవాడు. ఫీల్డ్ సెట్టింగ్స్ దగ్గర్నుంచి బౌలర్ల మార్పుల దాకా అన్నీ మాహీ చేప్పినట్టే సాగాయి.. 

Jadeja-Dhoni

అయినా విజయాలు రాకపోవడంతో సీజన్ మధ్యలోనే రవీంద్ర జడేజాని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. కెప్టెన్సీ ప్రెషర్ వల్ల బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫలమవుతుండడంతో తానే స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు జడ్డూ ప్రకటించినా, అతన్ని మేనేజ్‌మెంట్ బలవంతంగా తప్పించిందని వార్తలు వినిపించాయి...

ఇది జరిగిన తర్వాతి మ్యాచ్‌లోనే జడేజా గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జడేజా గాయపడ్డ మాట నిజమే అయినా సీజన్ మొత్తానికి దూరమయ్యేంత గాయమైందా? అనే విషయం గురించి చాలా పెద్ద చర్చే జరిగింది. ఇదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్, రవీంద్ర జడేజాని అన్‌ఫాలో అయ్యింది.. 

ఆ తర్వాత రవీంద్ర జడేజా కూడా సీఎస్‌కే సంబంధించిన ఫోటోలు, వీడియోలు అన్నింటినీ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసినప్పటి నుంచి సీఎస్‌కేతో రవీంద్ర జడేజా టచ్‌లో లేడు... 

click me!