గంగూలీ విషయంలో ఆ రోజు తప్పు జరిగింది... నిజం ఒప్పుకున్న పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్...

Published : Nov 21, 2020, 04:24 PM IST

దాయది దేశాల మధ్య సమరం అంటే అది మామూలుగా ఉండదు. ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే చాలు... ఓ రకమైన భిన్నమైన వాతావరణం నెలకొంటుంది. గెలుపు కోసం, ఆధిక్యం కోసం ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంది. 1999లో జరిగిన ఓ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ ఇలాగే అవుట్ అయ్యాడు.

PREV
113
గంగూలీ విషయంలో ఆ రోజు తప్పు జరిగింది... నిజం ఒప్పుకున్న పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్...

1999 ఏడాదిలో చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అవుట్ అయిన విధానంపై వివాదం నెలకొంది...

213

రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ముందు 270 పరుగుల టార్గెట్ ఉంచింది పాకిస్థాన్... మంచి ఫామ్‌లో ఉన్న సౌరవ్ గంగూలీ రెండు పరుగులకే అవుట్ అయ్యాడు. 

313

ముస్తాక్ బౌలింగ్‌లో కీపర్ మొయిన్ ఖాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు సౌరవ్ గంగూలీ...  గంగూలీ ఆడిన షాట్‌కి గాల్లో లేచిన బంతి స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అజర్ కాలికి తాకింది... తర్వాత గాల్లోకి లేవగానే కీపర్ మొయిన్ ఖాన్ క్యాచ్ అందుకున్నాడు.

413

క్యాచ్ అందుకున్నట్టు మొయిన్ ఖాన్ స్పష్టంగా అప్పీలు చేయడంతో అంపైర్లు కాసేపు చర్చించుకుని, సౌరవ్ గంగూలీని అవుట్‌గా ప్రకటించారు...

513

అయితే టీవీ రిప్లైలో అజర్ కాలికి తాకిన తర్వాత నేలపై పడిన తర్వాత మొయిన్ క్యాచ్ అందుకున్నట్టు స్పష్టంగా కనిపించింది.

613

గంగూలీ అవుట్ అయిన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన టీమిండియా... 258 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 12 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలుపొందింది.

713

ఈ సంఘటనపై 21 ఏళ్ల తర్వాత స్పందించాడు అప్పటి పాక్ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో వీడియో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంజమామ్, గంగూలీ విషయంలో తప్పు జరిగిందని ఒప్పుకున్నాడు.

813

‘ఆ సంఘటన జరిగినప్పుడు నేను మైదానంలో లేను. నా ఆరోగ్యం బాగోలేకపోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో అజర్ మహ్మద్ సబ్‌సిట్యూట్‌ ఫీల్డర్‌గా వచ్చాడు. గంగూలీ ఆడిన షాట్, అజర్ శరీరానికి తాకి కిందపడుతుండగా మొయిన్ క్యాచ్ అందుకున్నాడు.

913

అయితే అక్కడేం జరిగిందనేది కచ్ఛితంగా చెప్పలేను. కానీ అది మాత్రం సందేహత్మకమైన అవుట్... ’ అంటూ చెప్పుకొచ్చాడు ఇంజమామ్...

1013

21 ఏళ్ల తర్వాత గంగూలీ అవుట్ వివాదం విషయంలో పొరపాటు జరిగిందని ఒప్పుకున్న ఇంజమామ్‌ను అభినందించాడు రవిచంద్రన్ అశ్విన్...

1113

ఇంజమామ్ వుల్ హాక్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయడం చూసిన అప్పటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్... అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేశాడట... ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు పాక్ మాజీ కెప్టెన్.

1213

‘గడాఫీ క్రికెట్ స్టేడియంలో నేను ప్రాక్టీస్ చేస్తుండగా ఓసారి ఇమ్రాన్ ఖాన్ అక్కడికి వచ్చాడు. తన ఫ్రెండ్స్ చెప్పడంతో నా బ్యాటింగ్ చూసి పాక్ జట్టుకి ఎంపిక చేశాడు... ’ అని చెప్పుకొచ్చాడు ఇంజమామ్ వుల్ హక్.

1313

అలా అనుకోకుండా 1991 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన ఇంజమామ్ వుల్ హక్... పాకిస్థాన్ తరుపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు. 119 మ్యాచులకు కెప్టెన్‌గా కూడా వ్యవహారించాడు. 

click me!

Recommended Stories