రహానే... కెప్టెన్ అయినా నీలాగే ఉండు, కోహ్లీలా మారతానంటే కుదరదు... హర్భజన్ సింగ్ కామెంట్!!

First Published Nov 21, 2020, 1:47 PM IST

విరాట్ కోహ్లీ... ఓ యంత్రంలా పరుగులు సాధిస్తూనే ఉన్నా, కోట్లసంఖ్యలో హేటర్స్‌ను సంపాదించుకున్న క్రికెటర్. కారణం అతని యాటిట్యూడ్. మైదానంలో వీర ఆవేశంతో ఊగిపోయే కెప్టెన్, తన దూకుడైన ప్రవర్తన కారణంగా విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. అతని స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు తీసుకోబోతున్న అజింకా రహానేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్. కోహ్లీలా కాకుండా రహానేలాగే ఉండాలని సలహా ఇచ్చాడు. 

తనను విమర్శిస్తూ గోల చేస్తున్న ప్రేక్షకుల వైపు స్టేడియంలోనే మిడిల్ ఫింగర్ చూపించి, వార్తల్లో నిలిచిన క్రికెటర్ విరాట్ కోహ్లీ...
undefined
దురుసు ప్రవర్తనకి మారుపేరైన ఆస్ట్రేలియా క్రికెటర్లకే వెన్నులో వణుకుపుట్టించిన కోహ్లీ, అక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు...
undefined
అయితే డిసెంబర్ 17న ప్రారంభమయ్యే మొదటి టెస్టు ముగిసిన తర్వాత స్వదేశం బయలుదేరి రానున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ స్థానంలో టెస్టుల్లో వైస్ కెప్టెన్ అయిన అజింకా రహానే మిగిలిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించబోతున్నాడు.
undefined
కోహ్లీ మోస్ట్ అగ్రెసివ్ పర్సన్ అయితే... అజింకా రహానే మోస్ట్ కూల్ అండ్ కామ్ పర్సనాలిటీ. సెంచరీ చేసినా, ఫీల్డింగ్‌లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టినా పెద్దగా సెలబ్రేట్ కూడా చేసుకోడు రహానే...
undefined
అలాంటి రహానే కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచులు ఆడడం అంటే అంత ఈజీ కాదు... అందుకే రహానే, కోహ్లీ యాటిట్యూడ్‌ను కాపీ చేసేందుకు ప్రయత్నిస్తాడని, అలా చేయకూడదని అంటున్నాడు హర్భజన్ సింగ్.
undefined
‘అజింకా రహానే చాలా కూల్ పర్సన్. అతనిలో ఎలాంటి భావోద్వేగాలు పెద్దగా కనిపించవు. కోహ్లీ, రహానే ఇద్దరూ రెండు భిన్న ధృవాలు... ఆస్ట్రేలియా జట్టుపై టెస్టు కెప్టెన్సీ అతనికి చాలా పెద్ద ఛాలెంజ్...
undefined
ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కోవాలంటే విరాట్ కోహ్లీలాగే దూకుడుగా, ఆవేశంగా ప్రవర్తించాలని రహానే భావిస్తాడేమో... అయితే అది ఏ మాత్రం మంచిది కాదు.
undefined
రహానే తన స్టైల్, క్యారెక్టర్ మార్చుకోవాల్సిన అవసరం లేదు... కూల్ అండ్ కామ్‌గా కూడా కెప్టెన్సీ చేయొచ్చు... కేన్ విలియంసన్ ఉన్నాడుగా...’ అంటూ చెప్పుకొచ్చాడు హర్భజన్ సింగ్.
undefined
విరాట్ కోహ్లీ గైర్హజరీలో వైస్ కెప్టెన్ అజింకా రహానేకి బదులు రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. ఆసీస్ టూర్‌లో భారత జట్టును నడిపించే సత్తా రోహిత్‌కి ఉందని చెప్పాడు ఇర్ఫాన్ పఠాన్.
undefined
అయితే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హగ్ మాత్రం... ‘టెస్టు జట్టులో స్థానం సరిగా లేని రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఎలా ఇస్తారని’ కామెంట్ చేశాడు. ‘టెస్టుల్లో అనుభవం ఉన్న రహానే కెప్టెన్‌గా రాణిస్తాడని చెప్పాడు.
undefined
ఇంతకుముందు విరాట్ కోహ్లీ గాయం కారణంగా తప్పుకోవడంతో ఓ టెస్టు, మూడు వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే... అన్నింట్లోనూ విజయం సాధించాడు. రెండు ఫార్మాట్లలోనూ 100 శాతం విజయాలు అందుకున్న ఒకేఒక్క భారత కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రహానే.
undefined
click me!