బాబర్ ఆజమ్‌కి చేరువైన సూర్యకుమార్ యాదవ్... ఓర్వలేకపోతున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

Published : Aug 04, 2022, 03:11 PM IST

టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్. నిలకడైన పర్ఫామెన్స్‌తో శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌కే ఎర్త్ పెట్టిన సూర్య భాయ్, ఇప్పుడు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లోనూ దుమ్మురేపుతున్నాడు...

PREV
110
బాబర్ ఆజమ్‌కి చేరువైన సూర్యకుమార్ యాదవ్... ఓర్వలేకపోతున్న పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్, ఆ ఇన్నింగ్స్ తర్వాత ఏకంగా 44 స్థానాలు ఎగబాకి... ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి వచ్చాడు...

210
Suryakumar Yadav

తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్... టాప్ 2లోకి వచ్చి సెటిల్ అయ్యాయి...

310

దీంతో కొంతకాలంగా టాప్ 2లో ఉంటున్న పాకిస్తాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. అలాగే టాప్‌ 1లో ఉన్న బాబర్ ఆజమ్‌కీ, సూర్యకుమార్ యాదవ్‌కి ఉన్న పాయింట్ల తేడాతో 2 పాయింట్లు మాత్రమే...

410
Image credit: Getty

బాబర్ ఆజమ్ 818 పాయింట్లతో 1000 రోజులకు పైగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్నాడు. నాలుగో టీ20 మ్యాచ్‌లో సూర్యభాయ్ మరో హాఫ్ సెంచరీ బాదితే, బాబర్ ఆజమ్‌ని కూడా కిందకి నెట్టేయడం ఖాయం... ఇదే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి మింగుడు పడడం లేదు...

510

మొదటి రెండు మ్యాచుల్లో ఫెయిల్ అయిన తర్వాత మూడో టీ20లో 70+ పరుగులు చేస్తే.. 100 పాయింట్లు ఎలా ఇస్తారని ఐసీసీని నిలదీస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్. టెస్టుల్లో 81 పరుగులు చేసిన తర్వాత కూడా బాబర్ ఆజమ్‌కి కేవలం 5 పాయింట్లు ఇచ్చారని, సూర్యకుమార్ యాదవ్‌కి మాత్రం 100 పాయింట్లు ఎలా ఇస్తారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు...

610
Suryakumar Yadav

సూర్యకుమార్ యాదవ్ కేవలం భారత ప్లేయర్ కావడం వల్లే అతనికి ఇన్ని పాయింట్లు వచ్చాయని, ఐసీసీని చెప్పుచేతల్లో పెట్టుకుని బీసీసీఐ ఇలా ర్యాంకింగ్స్‌ని ప్రభావితం చేస్తోందని తమలోని ఓర్వలేనితనాన్ని బయటపెడుతున్నారు పాక్ ఫ్యాన్స్...

710

గత ఏడాది టీ20ల్లో 1326 పరుగులు చేసిన తర్వాత కూడా మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌ని చేరుకోలేకపోయాడని, మరి సూర్యకుమార్ యాదవ్ రెండు, మూడు ఇన్నింగ్స్‌లతో టాప్ 2లోకి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు...
 

810

అయితే టీ20ల్లో, టెస్టుల్లో, వన్డేల్లో పాయింట్లు కేటాయించే విధానం వేరుగా ఉంటుంది. టెస్టుల్లో బ్యాటర్ చేసే పరుగుల సగటు ఆధారంగా ర్యాంకింగ్స్ నిర్ణయిస్తే, టీ20ల్లో పరుగులతో పాటు స్ట్రైయిక్ రేటు కూడా కీలకంగా మారుతుంది...

910

సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచి 180+ యావరేజ్‌తో పరుగులు చేసిన ఇన్నింగ్స్‌లే ఎక్కువ. అలాగే మూడు మ్యాచుల్లో నాటౌట్‌గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్, ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో 212+ స్ట్రైయిక్ రేటుతో సెంచరీ చేశాడు...

1010

ఆ తర్వాత వెస్టిండీస్‌తో తొలి టీ20లో 150+, రెండో టీ20లో 183+, మూడో టీ20లో 172+ స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేయడంతో అతని ఖాతాలో పాయింట్లు చేరుతూ వచ్చాయి. టీ20ల్లో 40 బంతులాడి 50 పరుగులు చేసిన దానికి, 20 బంతుల్లో 50 పరుగులు చేసిన దానికీ తేడా తెలుసుకోలేకపోతే ఎలా అంటున్నారు భారత క్రికెట్ ఫ్యాన్స్... 

click me!

Recommended Stories