ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరితో కలిసి..

Published : Aug 04, 2022, 02:45 PM IST

Delhi Capitals Academy: ఐపీఎల్ లో ఇంతవరకు ట్రోఫీ నెగ్గని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. కెప్టెన్లు, ఆటగాళ్లు మారినా ఆ జట్టు తలరాత మాత్రం మారడం లేదు.   

PREV
17
ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ మాస్టర్ ప్లాన్.. ఆ ఇద్దరితో కలిసి..

జట్టు నిండా స్టార్లు. అరవీర భయంకర ఓపెనర్లు, భీకర బౌలర్లు, పాదరసంలా కదిలే ఫీల్డర్లు, ఆటగాళ్ల అవసరాలకు వెనకాడని యాజమాన్యం.. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఆ జట్టు ఇంతవరకూ ఐపీఎల్ లో ట్రోఫీ నెగ్గలేదు.

27

ఈ లీగ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ గా మొదలైన దాని ప్రయాణం.. ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్చుకున్నా దాని తలరాత మాత్రం మారలేదు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్ వంటి నాటి తరం దిగ్గజ ఆటగాళ్లతో పాటు  శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ లు కూడా ఆ జట్టుకు ఒక్కటంటే ఒక్క ఐపీఎల్ ట్రోఫీ అందించలేకపోయారు. 

37

అయితే ట్రోఫీ కలలను  సాకారం చేసుకోవడానికి ఢిల్లీ యాజమాన్యం  మాస్టర్ ప్లాన్ వేసింది. ప్రతీసారి రంజీలు, విదేశాల ఫ్రాంచైజీలు,  ఇతర జట్లలో దూకుడుగా ఆడే ఆటగాళ్ల కోసం చూడకుండా మెరికల్లాంటి  క్రికెటర్లను తామే తయారుచేసుకోవడానికి సిద్ధమైంది. 

47

ఈ మేరకు ఢిల్లీకి సమీపాన ఉన్న నోయిడాలో ఓ భారీ క్రికెట్ అకాడమీని నెలకొల్పింది.  ఈ అకాడమీలో  స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ (ఉచితంగా అయితే కాదు) ఇప్పించి.. తద్వారా వారిలో ‘ది బెస్ట్’ అనుకున్నవారితో ఐపీఎల్ ఆడించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. 

57

ఇక నోయిడాలో ఏర్పాటుచేసిన క్రికెట్ అకాడమీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రే, టాలెంట్ సెర్చ్  హెడ్ సబా కరీమ్ లు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఇద్దరూ అకాడమీలో కుర్రాళ్లకు క్రికెట్ పాఠాలను చెబుతున్నారు. 

67

ఇప్పటికే నోయిడా లోని క్రికెట్ స్టేడియంలో  ఏర్పాటుచేసిన  రెండ్రోజుల ప్రత్యేక శిక్షణా శిభిరంలో ఈ ఇద్దరూ కలిసి యువ క్రికెటర్లకు బ్యాటింగ్, బౌలింగ్ మెలుకువలు నేర్పారు. ఈ క్రికెట్ అకాడమీని నెలకొల్పడంపై  ప్రవీణ్ ఆమ్రే స్పందిస్తూ..  ఢిల్లీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ రీజియన్ లో స్థానిక క్రికెటర్లకు ఆటలో మెలుకువలు నేర్పేందుకు  ఢిల్లీ యాజమాన్యం  ఈ క్రికెట్ అకాడమీని నెలకొల్పిందని తెలిపాడు. సరైన సమయంలో సరైన సలహాలు పాటిస్తే యువ క్రికెటర్లు రాణించగలుగుతారని అన్నాడు. ఆ మేరకు తాము కృషి చేస్తామని చెప్పుకొచ్చాడు.  

77

సబా కరీమ్ స్పందిస్తూ.. ‘నోయిడాలోని యువ క్రికెటర్లకు ఇది గొప్ప అవకాశం. యువకులు అంతర్జాతీయ క్రికెట్ లో రాణించేందుకు గాను ఈ అకాడమీ ఎంతగానో ఉపయోగపడుతుంది. నోయిడాలో  నాణ్యమైన క్రికెట్ అకాడమీలు లేనందున ఆ కొరతను ఇది తీరుస్తుందని మేము భావిస్తున్నాం..’ అని అన్నాడు.  

click me!

Recommended Stories