టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. ఆర్‌సీబీకి ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫినిషర్ రోల్ పోషించిన దినేశ్ కార్తీక్, భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నిలకడైన పర్ఫామెన్స్‌తో దాదాపు టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ప్లేస్ కన్ఫార్మ్ చేసుకున్నాడు...
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌లో, ఐర్లాండ్ టూర్‌లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్, వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టీ20లోనూ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు...
27
Image credit: PTI
అయితే దినేశ్ కార్తీక్‌ని ఫినిషర్‌గా పిలవడం మాత్రం సరికాదంటున్నాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్. దినేశ్ కార్తీక్ ఎందుకు ఫినిషర్ కాదో కూడా చెబుతూ వివరణ ఇచ్చాడు శ్రీకాంత్...
37
Image credit: PTI
‘దినేశ్ కార్తీక్ ఫినిషర్ కాదు. ఎందుకంటే ఫినిషర్ అనే పదానికి మీరిచ్చే నిర్వచనమే కరెక్ట్ కాదు. అవును, దినేశ్ కార్తీక్ బాగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతను ఆడిన తీరు అద్భుతం. టీమిండియాకి కూడా కొన్ని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు...
47
Image credit: PTI
అయితే అతను ఫినిషర్ మాత్రం కాదు. ఎందుకంటే ఫినిషర్ అనేవాడు 8, 9వ ఓవర్ నుంచి ఆడుతూ మ్యాచ్‌ని ముగింపు స్టేజ్ వరకూ తీసుకెళ్లగలగాలి.. దినేశ్ కార్తీక్ చేస్తున్నది ఫినిషర్ రోల్ కాదు, తుది మెరుగులు దిద్దుతున్నాడంతే...
57
సూర్యకుమార్ యాదవ్‌ని ఫినిషర్ అనొచ్చు. అతను ఇంగ్లాండ్‌తో ఓ మ్యాచ్‌ని ఒంటిచేత్తో ముగించాడు. అలాగే హార్ధిక్ పాండ్యా, రిషబ్ పంత్‌లను కూడా ఫినిషర్లుగా పిలవచ్చు...
67
అంతేందుకు రోహిత్ శర్మ కూడా కొన్ని మ్యాచుల్లో ఆరంభం నుంచి వచ్చి కొన్ని మ్యాచ్‌లను 12వ గేర్‌లో ముగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతన్ని కూడా ఫినిషర్ అనొచ్చు...
77
ఫినిషర్ అనేవాడు 16 నుంచి 20 ఓవర్ల మధ్య ఆడేవాడు కాదు. మ్యాచ్‌ను మొత్తం భుజాలపై మోసుకుని విజయతీరాలకు చేర్చేవాడు.. దినేశ్ కార్తీక్ రోల్ అది కాదు. అతను కేవలం ఆఖర్లో మ్యాచ్‌ను మలుపు తిప్పగల ప్లేయర్ మాత్రమే..’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్...