పాక్ టీమ్‌లో విరాట్ కోహ్లీ లేడు, కానీ మాకు బాబర్ ఆజమ్ ఉన్నాడు... ఆకీబ్ జావెద్ కామెంట్...

Published : Oct 07, 2022, 01:28 PM IST

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా కంటే బెటర్ పర్ఫామెన్స్ ఇచ్చింది పాకిస్తాన్ టీమ్. అంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ గ్రూప్ స్టేజీలో టాపర్‌గా నిలిచింది పాక్ టీమ్. అయితే పాక్ జట్టు విజయావకాశాలన్నీ టాపార్డర్‌పైనే ఆధారపడుతున్నాయి...

PREV
16
పాక్ టీమ్‌లో విరాట్ కోహ్లీ లేడు, కానీ మాకు బాబర్ ఆజమ్ ఉన్నాడు... ఆకీబ్ జావెద్ కామెంట్...
Babar Azam

టాపార్డర్‌లో బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ అదరగొడుతూ పాకిస్తాన్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరూ విఫలమైతే పాక్ పేకమేడలా కూలి, ఘోర ఓటములను చవి చూడాల్సి వస్తోంది. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ముందు మిడిల్ ఆర్డర్ ఫెయిల్యూర్ పాక్‌కి పెద్ద సమస్యగా మారింది...

26
Babar and Rizwan

ఆసియా కప్ 2022 టోర్నీతో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన ఏడు టీ20ల సిరీస్‌లోనూ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అయితే చిన్న మార్పులతో పాక్ మిడిల్ ఆర్డర్ సమస్యను తీరిపోతుందని అంటున్నాడు 1992 వరల్డ్ కప్ విన్నింగ్ క్రికెటర్ అకీబ్ జావెద్...

36

‘పాకిస్తాన్‌కి నెం.4లో విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు. ఆ పొజిషన్‌లో సరైన బ్యాట్స్‌మెన్‌ని ఇంకా వెతుకుతూనే ఉంది పాకిస్తాన్. అయితే పాక్ టీమ్‌లో బాబర్ ఆజమ్ ఉన్నాడు. ఇప్పుడు పాక్ టీమ్ మొత్తం ఓపెనర్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్‌లపైనే ఆధారపడుతోంది..

46
Virat Kohli-Babar Azam

ఈ ఇద్దరూ అవుటైతే స్టేడియంలో పాక్ ఫ్యాన్స్ కూడా బయటికి వెళ్లిపోతున్నారు. కారణం మిడిల్ ఆర్డర్‌పైన ఫ్యాన్స్‌కి కూడా నమ్మకాలు లేవు. అయితే బాబర్ ఆజమ్‌ని నాలుగో స్థానంలో ఆడిస్తే మిడిల్ ఆర్డర్ సమస్య తీరుతుంది...

56
Virat Kohli-Babar Azam

అసిఫ్ ఆలీ ఆరో స్థానంలో అదరగొట్టగలడు. ఆఖర్లో అతనికి 2 ఓవర్లు ఉన్నా సరిపోతుంది. చివర్లో ధనాధన్ ఫినిషింగ్ ఇవ్వగలడు... ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు మిస్ అయినా పాక్ టీమ్ బౌలింగ్‌ బలంగానే కనబడుతోంది. కారణం పాక్ టీమ్ కొందరు ప్లేయర్లపైనే ఆధారపడడం లేదు...

66
Babar Azam and Mohammad Rizwan

ఇంగ్లాండ్ బ్యాటర్లు భయం లేకుండా బ్యాటింగ్ చేస్తారు. పాకిస్తాన్ కూడా ఇలాంటి మైండ్‌సెట్‌తో బ్యాటింగ్ చేయాలి. అప్పుడు టాప్ క్లాస్ టీమ్స్‌కి పోటీ ఇవ్వగలుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు అకీబ్ జావెద్...  

Read more Photos on
click me!

Recommended Stories