రాసిపెట్టుకోండి! మేం పాక్‌కి వెళ్లం, కానీ వాళ్లు ఇండియాకి వచ్చి తీరుతారు.. అనురాగ్ ఠాకూర్ కామెంట్...

Published : Nov 27, 2022, 11:04 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీ గురించి ఇండియా, పాకిస్తాన్ మధ్య చిచ్చు రేపింది. షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్‌లో ఆసియా కప్ 2023 టోర్నీ జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో అడుగుపెట్టేది లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేయడంతో ఇరుదేశాల బోర్డుల మధ్య వాగ్వాదం నడుస్తోంది...

PREV
15
రాసిపెట్టుకోండి! మేం పాక్‌కి వెళ్లం, కానీ వాళ్లు ఇండియాకి వచ్చి తీరుతారు..  అనురాగ్ ఠాకూర్ కామెంట్...
Sourav Ganguly-Jay shah

ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా ఉన్న జై షా స్వయంగా భారత జట్టు, పాకిస్తాన్‌లో అడుగుపెట్టబోదని, తటస్థ వేదికపై ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని చెప్పడంతో పాక్ క్రికెట్ బోర్డు షాక్ అయ్యింది...

25

ఆసియా కప్‌ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌కి రాకపోతే పాక్ జట్టు... ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆడదని పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా కామెంట్ చేశాడు. అంతేకాకుండా ‘మేం రాకపోతే వరల్డ్ కప్ మ్యాచులు ఎవరు చూస్తారంటూ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు రమీజ్ రాజా...

35

‘‘ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టు, పాకిస్తాన్‌కి రాకపోతే మేం ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొనం. ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం... భారత జట్టు, ఇక్కడికి వస్తే, మేం అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే మేం లేకుండానే వరల్డ్ కప్ జరుపుకోవచ్చు... మేం రాకపోతే వన్డే వరల్డ్ కప్ మ్యాచులను ఎవరు చూస్తారు...’

45

పాక్ క్రికెట్ బోర్డు ఎవ్వరికీ భయపడదు.  2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాని ఓడించడం... ఆసియా కప్ 2022 టోర్నీలో కూడా భారత జట్టును చిత్తు చేశాం. ఒకే ఏడాది గ్యాప్‌లో పాకిస్తాన్ క్రికెట్ టీమ్, బిలియన్ డాలర్ ఎకానమీ టీమ్‌ని రెండు సార్లు ఓడించింది. పాక్ పటిష్టంగా మారిందని చెప్పడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది...’ అంటూ వ్యాఖ్యానించాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా...

55

‘కరెక్ట్ సమయం కోసం వేచి చూడండి. వరల్డ్ క్రికెట్‌లో ఇండియా ఓ అత్యున్నత శక్తి. ఇండియాని ఏ దేశం కూడా డామినేట్ చేయలేదు. మేం పాకిస్తాన్‌కి వెళ్లబోం, కానీ వాళ్లు వన్డే వరల్డ్ కప్ ఇక్కడికి వచ్చి తీరతారు... కావాలంటే రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ సభ్యుడు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. 

click me!

Recommended Stories