ICC World cup 2023 : హైదరాబాదీ ఆతిథ్యానికి పాక్ క్రికెటర్లు ఫిదా... ఉప్పల్ గ్రౌండ్ విడిచివెళుతూ ఎమోషనల్

First Published Oct 11, 2023, 10:39 AM IST

ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023 కోసం భారత్ కు విచ్చేసిన పాకిస్థాన్ క్రికెటర్లు హైదరాబాద్ తో అటాచ్ మెంట్ ఏర్పర్చుకున్నారు. ఇప్పుడు ఈ నగరాన్ని విడిచివెళుతుండటంతో ఎమోషనల్ అవుతున్నారు. 

Uppal Stadium

హైదరాబాద్ : శత్రువునైనా ప్రేమించే గొప్ప మనసు తెలుగువారిదని మరోసారి నిరూపితమయ్యింది. భారత్ శత్రుదేశంగా భావించి విద్వేశంతో రగిలిపోతుంటుంది పాకిస్థాన్. అలాంటిది ఐసిసి వన్డే ప్రపంచకప్ 2023 కోసం చాలాకాలం తర్వాత భారత్ లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ టీం తెలుగువారి ఆతిథ్యానికి ఫిదా అయ్యారు. గత రెండు వారాలుగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనే వుంటున్న పాక్ క్రికెటర్లను శతృదేశానికి చెందినవారిగా కాకుండా ప్రత్యేక అతిథులుగా చూసుకున్నారు. ప్రత్యేకించి ఉప్పల్ స్టేడియం సిబ్బంది చూపించిన ప్రేమ, కేరింగ్ తో దాయాది దేశం క్రికెటర్లను ఫిదా చేసింది. ఎమోషనల్ బాండింగ్ ఏర్పడటంతో ఉప్పల్ గ్రౌండ్ సిబ్బందికి ఆత్మీయత పంచి గొప్పమనసు చాటుకున్నారు పాక్ క్రికెటర్లు.   

Pakistan team

వన్డే ప్రపంచకప్ కోసం భారతదేశంలో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ టీం ఇప్పటివరకు హైదరాబాద్ లోనే బసచేసింది. ప్రాక్టీస్, వార్మాప్ మ్యాచులతో పాటు తొలి రెండు మ్యాచులను కూడా ఉప్పల్ స్టేడియంలోనే ఆడింది పాకిస్థాన్. ఈ సమయంలో పాక్ క్రికెటర్లను గ్రౌండ్ సిబ్బంది ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అడిగిందే తడవుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. దీంతో తాము హోంగ్రౌండ్ లో ఆడుతున్నట్లు ఫీలయిన పాక్ క్రికెటర్లు మరింత కాన్పిడెంట్ తో ఆడారు. దీంతో ఉప్పల్ స్టేడియంలో ఆడిన రెండు మ్యాచుల్లోనే పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. 
 

Pak vs SL

హైదరాబాద్ లో పాక్ క్రికెటర్లు ఎంత కంపర్ట్ గా వున్నారో శ్రీలంకతో జరిగిన నిన్నటి మ్యాచ్ ద్వారా అర్థమవుతుంది. శ్రీలంక విసిరిన 345 పరుగుల భారీ లక్ష్యం కూడా పాక్ ముందు చిన్నబోయింది. సొంత మైదానంలో ఆడుతున్నట్లు పాక్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్), అబ్దుల్ షఫీక్ (113) సెంచరీలతో చెలరేగిపోయారు. దీంతో పాకిస్థాన్ ప్రపంచ కప్ చరిత్రలో నిలిచిపోయే అద్భుత విజయాన్ని అందుకుంది. 

Hyderabad

ఇలా అచ్చొచ్చిన ఉప్పల్ మైదానాన్ని, అభిమానంగా చూసుకున్న సిబ్బందిని వదిలివెళ్ళాల్సిన సమయం రావడంతో పాక్ క్రికెటర్లు ఎమోషన్ అయ్యారు. శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఉప్పల్ గ్రౌండ్ స్టాప్ తో పాక్ క్రికెటర్లు సరదాగా ముచ్చటస్తూ కొందరికి జెర్సీలు బహూకరించారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తో పాటు మరికొందరు క్రికెటర్లు సిబ్బందితో కలిసి ఫోటోలు దిగారు. ఇలా పాక్ క్రికెటర్లు తమతో ఆత్మీయంగా వ్యవహరించడంతో ఉప్పల్ మైదానంలో పనిచేసే సిబ్బంది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.   
 

Hyderabadi Biryani

ఇక ఇప్పటికే హైదరబాదీల ఆహారానికి, అభిమానానికి పాక్ క్రికెటర్లు ఫిదా అయ్యారు. హైదరాబాదీ బిర్యాని రుచి తమకెంతో నచ్చిందని స్వయంగా పాక్ క్రికెటర్లే వెల్లడించారు. హైదరాబాదీ సంస్కృతి సాంప్రదాయాలు, వంటకాలు తమ దేశంలో మాదిరిగానే వుండటంతో ఇక్కడ చాలా కంపర్ట్ గా వున్నారు పాక్ క్రికెటర్లు. అందువల్లే హైదరాబాద్ ను వీడి వెళుతుండటంతో వాళ్ళు కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. 

click me!