ICC World cup 2023: ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి రెస్ట్! అతనికి అవకాశం..

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాని ఓడించి బోణీ కొట్టింది టీమిండియా. రెండో మ్యాచ్‌లో పసికూన ఆఫ్ఘనిస్తాన్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు..

ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓ మార్పుతో బరిలో దిగబోతున్నట్టు సమాచారం.. ఆసీస్‌తో మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌తో పాటు రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యారు..
 

అయితే ఈ ముగ్గురికీ ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లోనూ అవకాశం దక్కనుంది. శుబ్‌మన్ గిల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఇషాన్ కిషన్‌కి మరో అవకాశం ఇవ్వడం తప్ప టీమిండియాకి మరో ఆప్షన్ లేదు..
 


Shreyas Iyer

శ్రేయాస్ అయ్యర్‌కి నాలుగో స్థానంలో మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనూ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాబట్టి ఒక్క మ్యాచ్ ఫెయిల్యూర్‌తో అతన్ని పక్కనబెట్టడం సరికాదు..
 

ఆసీస్‌తో మ్యాచ్‌లో ఆడిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో ఆడడం అనుమానంగా మారింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కి అవకాశం ఇవ్వాలని అనుకుంటోందట టీమిండియా మేనేజ్‌మెంట్.. 

Ashwin

ఆఫ్ఘనిస్తాన్‌ టీమ్‌లో స్పిన్నర్లు పుష్కలంగా ఉన్నారు. వారికి స్పిన్ బౌలింగ్‌ని ఎదుర్కోవడం పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. అందుకే అశ్విన్‌కి రెస్ట్ ఇచ్చినా టీమ్‌పై పెద్దగా ప్రభావం పడదు.. 

Shardul Thakur

మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రాతో పాటు శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా ఫాస్ట్ బౌలర్లుగా బరిలో దిగుతారు. రవీంద్ర జడేజాకి స్పిన్నర్‌గా చోటు దక్కుతుంది. అవసరమైతే శ్రేయాస్ అయ్యర్‌తో బౌలింగ్ వేయించొచ్చు... 

Latest Videos

click me!