పెళ్లి అయ్యాక రాహుల్ చాలా మారిపోయాడు! ఇంతకుముందులా లేడు.. - ఇర్ఫాన్ పఠాన్

First Published | Oct 10, 2023, 8:51 PM IST

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి శతాధిక భాగస్వామ్యంతో టీమిండియాని ఆదుకున్నారు..
 

KL Rahul

విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ కలిసి నాలుగో వికెట్‌కి 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 85 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ అవుటైనా కెఎల్ రాహుల్ 97 పరుగులతో అజేయంగా నిలిచాడు. విజయానికి 5 పరుగులు కావాల్సిన సమయంలో 6 సిక్సర్ బాది మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు కెఎల్ రాహుల్..
 

‘పెళ్లి తర్వాత కెఎల్ రాహుల్‌లో చాలా మార్పు కనిపిస్తోంది. అతను మునుపటిలో కంగారు పడడం లేదు. చాలా కూల్ అండ్ కామ్‌గా ఉంటున్నాడు. అసలు కెఎల్ రాహుల్‌లానే ఉండడం లేదు..
 

Latest Videos


ఇంతకుముందు కెఎల్ రాహుల్ కీలక సమయంలో చాలా ఒత్తిడికి లోనయ్యేవాడు. అనవసర ఒత్తిడికి లోనై, వికెట్ పారేసుకునేవాడు. ఇప్పుడు అతనిలో, అతని ఆటలో చాలా పరిపక్వత కనిపిస్తోంది...

KL Rahul

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ ఆడిన ఇన్నింగ్స్ చాలా స్పెషల్. 3 వికెట్లు పడిన తర్వాత విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడుతుంటే కెఎల్ రాహుల్ ఫ్రీగా షాట్స్ ఆడాడు. కోహ్లీ నుంచి ప్రెషర్ మొత్తం తీసుకుని ఇన్నింగ్స్ నిర్మించాడు..

సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేయడమే కాకుండా బిగ్ షాట్స్ ఆడుతున్నాడు. స్వీప్ షాట్స్ ఆడుతున్నాడు. పుల్ షాట్స్ కూడా ఆడేస్తున్నాడు. అతని టెక్నిక్ చాలా మెరుగైంది. ఇంతకుముందు కంటే చాలా మెరుగైన ఆటగాడిగా మారాడు..
 

KL Rahul

విరాట్ కోహ్లీ చాలా సార్లు ఇలాంటి గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. అవతలి ఎండ్‌లో ఎన్ని వికెట్లు పడినా, ఎంత మంది బ్యాటర్లు మారినా కోహ్లీలో కాన్ఫిడెన్స్ తగ్గదు. వన్డే వరల్డ్ కప్‌లో కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ.. టీమ్‌కి చాలా ముఖ్యమైన ప్లేయర్లు అవుతారు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్..

click me!