అలాంటి ప్లేయర్ దొరకడం చాలా అరుదు, టీమిండియా అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి...

Published : Jul 16, 2021, 01:30 PM IST

ఒకప్పుడు భారత జట్టు విజయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్‌, ఇప్పుడు గడ్డు కాలం ఎదుర్కొంటున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు అతనికి తుదిజట్టులో చోటు ఇవ్వకుండా వివిధ సిరీస్‌లు, టూర్‌లు తిప్పింది టీమిండియా...

PREV
19
అలాంటి ప్లేయర్ దొరకడం చాలా అరుదు, టీమిండియా అతన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి...

ఇంగ్లాండ్‌తో స్వదేశంతో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండు టెస్టులు ఆడిన కుల్దీప్ యాదవ్, వన్డే సిరీస్‌లో చోటు వచ్చినా ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు...

29

కొన్నేళ్లుగా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా కేవలం రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడం వల్ల అతని బౌలింగ్ యాక్షన్‌లో వచ్చిన తేడా, ఇంగ్లాండ్ సిరీస్‌లో స్పష్టంగా కనిపించింది...

39

‘కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లు దొరకడం చాలా అరుదు. చైనామెన్ అనేది ఓ ప్రత్యేకమైన టాలెంట్. అలాంటి ప్లేయర్లు సరిగ్గా పర్ఫామ్ చేయాలంటే, సీనియర్లు, కెప్టెన్ అండగా ఉండాలి...

49

ఇలాంటి అరుదైన ప్లేయర్లకు సాధ్యమైనన్ని ఎక్కువ అవకాశాలు ఇస్తే, వారి టాలెంట్ మరింత మెరుగు అయ్యేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ బాధ్యత టీమ్ మేనేజ్‌మెంట్‌పైనే ఉంటుంది...

59

కుల్దీప్ యాదవ్‌కి తగినన్ని అవకాశాలు దొరికి ఉంటే, అది అతని పర్ఫామెన్స్ మెరగయ్యేది. ఆ రిజల్ట్ బాడీ లాంగ్వేజ్‌లో కూడా కనిపించేది...

69

కుల్దీప్ యాదవ్‌ను సరిగ్గా వినియోగించుకోవడంలో టీమ్ ఫెయిల్ అయింది. చైనామెన్ వంటి అరుదైన టాలెంట్ ఉన్న ప్లేయర్‌ను టీమిండియా సరిగ్గా పట్టించుకోవడం చూస్తుంటే చాలా బాధేసింది...

79

శ్రీలంక టూర్‌లో కోచ్ రాహుల్ ద్రావిడ్, కుల్దీప్ యాదవ్‌ను సరిగ్గా వాడతారని అనుకుంటున్నా... స్పిన్నర్లను ఎలా ఉపయోగించుకోవాలో ద్రావిడ్‌కి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్...

89

2019 జనవరిలో ఆస్ట్రేలియా టూర్‌లో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదేసి వికెట్లు తీసి అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, ఏడాదిన్నర పాటు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడని గుర్తుచేశాడు కైఫ్...

99

26 ఏళ్ల కుల్దీప్ యాదవ్, టీమిండియా తరుపున 63 వన్డేలు, 21 టీ20 మ్యాచులు, 7 టెస్టు మ్యాచులు ఆడి మొత్తంగా 170 వికెట్లు పడగొట్టాడు...

click me!

Recommended Stories