ఇంగ్లాండ్‌కి షాక్ ఇచ్చిన పాకిస్తాన్... తొలి టీ20లో అద్భుత విజయం... లివింగ్‌స్టోన్ సెంచరీతో...

First Published Jul 17, 2021, 9:03 AM IST

వన్డే సిరీస్‌ను 3-0తేడాతో కోల్పోయిన పాకిస్తాన్ జట్టు, తొలి టీ20లో అద్భుత విజయం సాధించి, ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి... టీ20ల్లో నెం.1 జట్టుగా ఉన్న ఇంగ్లాండ్‌కి ఊహించని షాక్ ఇచ్చింది... ఇంగ్లాండ్ సీ జట్టు, చిత్తుచేసిన పాక్‌ చేతుల్లో మెయిన్ టీమ్ పరాజయం చెందడం విశేషం.

టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లాండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. వికెట్ కీపర్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ కలిసి తొలి వికెట్‌కి 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
undefined
రిజ్వాన్ 41 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేయగా, బాబర్ ఆజమ్ 49 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేశాడు.
undefined
ఫకార్ జమాన్ 8 బంతుల్లో 26, హాఫీజ్ 10 బంతుల్లో 24 పరుగులు, మసూద్ 7 బంతుల్లో 19 పరుగులు చేశారు...
undefined
వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 232 పరుగుల భారీ స్కోరు చేసింది పాకిస్తాన్.
undefined
233 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ జట్టు, 19.2 ఓవర్లలో 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జాసన్ రాయ్ 13 బంతుల్లో 32 చేయగా లియామ్ లివింగ్ స్టోన్ 43 బంతుల్లో 6 ఫర్లు, 9 సిక్సర్లతో 103 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.
undefined
17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన లివింగ్ స్టోన్, ఇంగ్లాండ్ తరుపున అత్యధిక వేగంగా ఈ ఫీట్ అందుకున్న క్రికెటర్‌‌గా నిలిచాడు. 42 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న లివింగ్ స్టోన్, టీ20ల్లో ఇంగ్లాండ్ తరుపున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదుచేశాడు.
undefined
లివింగ్ స్టోన్‌కి ఏ బ్యాట్స్‌మెన్ కూడా సహకరించకపోవడంతో ఇంగ్లాండ్ జట్టుకి 31 పరుగుల తేడాతో పరాజయం ఎదురైంది. షాహీన్ అఫ్రిదీ 3 వికెట్లు తీయగా షాదబ్ ఖాన్ కూడా మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను దెబ్బ తీశారు.
undefined
click me!