PAK vs UAE : యూఏఈపై గెలుపు.. ఆసియా కప్ 2025 సూపర్ 4లోకి పాకిస్తాన్ ఎంట్రీ

Published : Sep 18, 2025, 01:05 AM IST

PAK vs UAE: డూ ఆర్ డై మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు యూఏఈని 41 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో సూపర్‌-4 లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోసారి భారత జట్టుతో సూపర్ ఫోర్ లో తలపడనుంది.

PREV
14
పాకిస్తాన్ ను భయపెట్టిన యూఏఈ

ఆసియా కప్ 2025 కీలక మ్యాచ్ లో పాకిస్తాన్ యూఏఈ పై గెలిచి సూపర్ ఫోర్ లోకి ప్రవేశించింది. బుధవారం ఆసియా కప్ 2025లో గ్రూప్-ఏ 10వ మ్యాచ్ లో పాక్, యూఏఈ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టును యూఏఈ బౌలర్లు భయపెట్టేశారు. ఆ తర్వాత వారి బ్యాటింగ్ సమయంలో కూడా కొంత సేపు మ్యాచ్ ను పూర్తిగా తమ వైపు ఉంచుకున్నారు.

పాక్ బ్యాటింగ్ సమయంలో ఆరంభంలో త్వరగానే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు కొద్ది సేపు దూకుడు చూపినా స్థిరంగా నిలువలేకపోయారు. మిడిల్ ఆర్డర్‌లోనూ పెద్ద భాగస్వామ్యం రాకపోవడంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే ఫఖర్ జమాన్ 36 బంతుల్లో 50 పరుగులతో పాక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. చివర్లో షాహీన్ అఫ్రిదీ 14 బంతుల్లో 29 పరుగులు చేయడంతో పాక్ 20 ఓవర్లలో 146/9 చేసింది.

24
యూఏఈ బౌలర్ల అద్భుత ప్రదర్శన

యూఏఈ బౌలర్లు కచ్చితమైన లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. జునైద్ సిద్దిఖీ 4 వికెట్లు తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సిమ్రంజీత్ సింగ్ కూడా 3 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్‌లో రెండు కీలక క్యాచ్‌లు వదిలేయడం, డెత్ ఓవర్లలో తప్పిదాలు చేయడం వలన పాకిస్తాన్ కు కొన్ని పరుగులు వచ్చాయి.

34
చివరలో యూఏఈ బ్యాటింగ్ కుప్పకూలింది

147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ జట్టు పాక్ బౌలర్ల ముందు నిలవలేకపోయింది. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. అబ్రార్ అహ్మద్, షాహీన్ అఫ్రిదీ ఆరంభంలో యూఏఈని దెబ్బకొట్టారు. రాహుల్ చోప్రా, ధృవ్ పరాశర్ క్రీజులో ఉన్నంత సేపు మ్యాచ్ యూఏఈ వైపున ఉంది. 

అయితే, వీరు అవుట్ అయిన తర్వాత ఆ జట్టు ఎక్కువ సేపు పాక్ బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. పాక్ కెప్టెన్ బౌలర్లను చాకచక్యంగా మారుస్తూ మ్యాచ్ ను తమవైపు తీసుకొచ్చాడు. ఒత్తిడిలో యూఏఈ 17.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

44
పాకిస్తాన్ vs యూఏఈ మ్యాచ్ లో టాప్ పాయింట్స్

• ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

• షాహీన్ అఫ్రిదీ 14 బంతుల్లో 29 పరుగులు చేసి, బౌలింగ్‌లోనూ కీలక వికెట్లు తీశాడు.

• జునైద్ సిద్దిఖీ 4/18 గణాంకాలతో యూఏఈ తరఫున బౌలింగ్ లో అదరగొట్టాడు.

• పాక్ బౌలర్లు సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు విజయాన్ని అందించారు.

• ఈ విజయంతో పాక్ సూపర్‌-4లోకి చేరగా, యూఏఈ టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది.

• పాక్ గ్రూప్-ఏలో భారత్‌తో కలసి సూపర్‌-4లో అడుగు పెట్టింది. మరోసారి ఈ రెండు జట్లు తలపడనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories