పాకిస్తాన్ కూడా మరో ఆఫ్ఘాన్‌లా మారనుందా... క్రికెట్‌ టోర్నీలు కూడా నిర్వహించలేని దారుణ స్థితికి...

First Published Sep 17, 2021, 3:50 PM IST

భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్ అంటే క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ క్రేజీ ఫైట్. ఇరుదేశాల జనాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు... అయితే ఇప్పుడు ఇరుదేశాల మధ్య మ్యాచ్ చూడాలంటే ఐసీసీ టోర్నీల్లోనే వీలవుతోంది...

ఒకప్పుడు ఆస్ట్రేలియా వంటి టాప్ టీమ్‌లకు కూడా వణుకు పుట్టించిన జట్టు పాకిస్తాన్. అరవీర భయంకర ఫాస్ట్ బౌలర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించేవాళ్లు... అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది...

2008 తర్వాత దాయాది దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దు అయ్యాయి. ఈ కారణంగా భారత్‌ నష్టపోయిన దానికంటే, పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయింది...  

2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత ఏడేళ్ల తర్వాత ఏ జట్టూ, పాక్‌లో పర్యటించడానికి సాహసం చేయలేదు... తటస్థ వేదికలైన యూఏఈలోనే మ్యాచులన్నీ జరిగేవి...

అయితే 2015 తర్వాత పరిస్థితి కాస్త మారింది... జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా వంటి జట్లు పాక్‌లో పర్యటించి. సిరీస్‌ ఆడగలిగాయి...

అయితే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్ మాత్రం ఇప్పటిదాకా పాక్‌లో పర్యటించలేదు. 2003-04 పర్యటన తర్వాత దాదాపు 18 ఏళ్లకు తొలిసారిగా పాకిస్తాన్‌లో పర్యటించడానికి అంగీకరించింది న్యూజిలాండ్...

టూర్ ప్రారంభానికి ముందే పాక్‌లో పరిస్థితులపై అనుమానాలు వ్యక్తం చేసింది న్యూజిలాండ్. కివీస్ భద్రతా అధికారులు, పాక్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను సమీక్షించి... అంతా బాగానే ఉందనే అభిప్రాయానికి వచ్చాకే న్యూజిలాండ్ ఆటగాళ్లు, పాకిస్తాన్‌కి వచ్చారు...

పాకిస్తాన్‌లో క్వారంటైన్ పూర్తిచేసుకుని, ప్రాక్టీస్ చేసి... తీరా వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ప్రభుత్వ హెచ్చరికలతో ఉన్నపాటుగా టూర్‌ను రద్దు చేసుకుని, వెనక్కి వెళ్లిపోతున్నట్టు ప్రకటించింది న్యూజిలాండ్...

ఈ సంఘటన పాక్‌లో పర్యటించే మిగిలిన దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే ఏడాది ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ (మరోసారి) పాక్‌లో పర్యటించాల్సి ఉంది...

అయితే న్యూజిలాండ్ భయంతో వెనక్కి రావడంతో మిగిలిన జట్లు రావడానికి ఇష్టపడకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా...

పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పాకిస్తాన్ మరో ఆఫ్ఘాన్‌లా మారుతుందని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్‌ సూపర్ 12 రౌండ్‌కి నేరుగా అర్హత సాధించిన ఆఫ్ఘాన్, స్వదేశంలో ఒక్క టోర్నీ కాదు కదా... ఒక్క మ్యాచ్ ఆడలేని దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది...

భారత్‌ మీద అక్కసుతో తుపాకీ చేతబట్టిన తాలిబన్లను ప్రోత్సాహించిన పాక్, దానికి భారీ మూల్యం చెల్లించుకుంటోందని అంటున్నారు భారత అభిమానులు...

ला नतीजाजल्द ही, लोगों ने उनके आकर्षक और अपने मुल्क के समर्थन में दिए जाने वाले नारों की वजह से पहचानना शुरू कर दिया। ‘चाचा क्रिकेट’ की लोकप्रियता बढ़ने के साथ पाकिस्तान क्रिकेट कंट्रोल बोर्ड ने आधिकारिक तौर पर उन्हें पाकिस्तान क्रिकेट टीम दुनिया में जहां भी मैच खेलने जाती, वहां साथ जाने के लिए हायर कर लिया। फैक्ट चेकिंग में ये बात साबित हो जाती है कि चाचा क्रिकेट की मौत की खबर झूठी है।

అయితే పాకిస్తానీల వాదన మాత్రం వేరేగా ఉంది. ఎప్పటిలాగే పాక్‌లో ఏం జరిగినా, దానికి భారత్‌ కారణమనుకునే పాక్ జనాలు... దీని వెనక కూడా భారత రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు..

click me!