Riyan Parag
Riyan Parag IPL 2025: ఐపీఎల్ 2025 23వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది. బుధవారం (ఏప్రిల్ 9) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో పాటు సూపర్ బౌలింగ్ తో రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. భారీ టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 58 పరుగులు తేడాతో రాజస్థాన్ పై గుజరాత్ విక్టరీ అందుకుంది.
అయితే, మ్యాచ్‌లో రియాన్ పరాగ్ విషయంలో పెద్ద వివాదం నెలకొంది. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో అతను ఔట్ అయిన తర్వాత, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మరో డ్రామా కనిపించింది అతను అవుట్ అయ్యాడా లేదా అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మొదలైంది.
టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 217 పరుగులు చేసింది. 218 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ జట్టు 14 బంతుల్లోనే 12 పరుగులకే తొలి రెండు వికెట్లు కోల్పోయింది.
దీని తరువాత, రియాన్ పరాగ్ బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి వచ్చాడు. అతను మూడు సిక్సర్లు కొట్టడంతో రాజస్థాన్‌ను తిరిగి ఆటలోకి తీసుకువచ్చాడు. అదే జోష్ లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కుల్వంత్ ఖేజ్రోలియా చేతిలో అవుట్ అయ్యాడు. రియాన్ 14 బంతుల్లో 26 పరుగుల ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 3 సిక్సర్లు బాదాడు.
అంపైర్ తో రియాన్ పరాగ్ గొడవ ఎందుకు?
రాజస్థాన్ ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో కుల్వంత్ ఖేజ్రోలియా బౌలింగ్ చేయడానికి వచ్చాడు. పరాగ్ తన నాలుగో బంతిని సరిగ్గా ఆడలేకపోయాడు. బంతి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లోకి వెళ్ళింది. అతను గట్టిగా అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్ అతన్ని అవుట్ అని ప్రకటించాడు.
రియాన్ పరాగ్ సమీక్ష తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే బంతి బ్యాట్‌కు తగలలేదు. బ్యాట్ నేలను తాకినప్పుడు శబ్దం వచ్చింది. కానీ, అతన్ని అవుట్ గా ప్రకటించారు. రివ్యూలో థర్డ్ అంపైర్ అలా అనుకోలేదు. అతను ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సమర్థించాడు.
Riyan Parag. (Photo: IPL)
థర్డ్ అంపైర్ కూడా అవుట్ ఇచ్చిన తర్వాత రియాన్ పరాగ్ కోపంగా ఉన్నాడు. అతను ఫీల్డ్ అంపైర్ తో చాలా సేపు వాదించాడు. బంతి బ్యాట్‌కు తగలలేదని అతను వారికి వివరించడానికి ప్రయత్నించాడు. కానీ, మైదానంలోని అంపైర్లు అతన్ని బయటకు వెళ్ళమని కోరారు. ర్యాన్ కోపంగా పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది.
కొంతమంది అతను ఔట్ అయ్యాడని అంటుంటే, మరికొందరు అతను ఔట్ కాలేదని చెబుతున్నారు. కానీ, రియాన్ తన బ్యాట్ కు బాల్ తగలలేదనీ, బ్యాట్ నేలకు తాకిన సౌండ్ అని వాదించాడు. అల్ట్రా సౌండ్ స్పైక్ కూడా బ్యాట్ ను బాల్ తాకకముందే వచ్చిందనీ, కానీ అంపైర్ అవుట్ గా ప్రకటించడం ఏంటని సోషల్ మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి.
రియాన్ పరాగ్ అవుట్ పై సోషల్ మీడియా రియాక్షన్స్ ఇక్కడ చూడండి