Virat Kohli: నో ఈగో.. విరాట్ కోహ్లీ క్రికెట్ ఫిలాసఫీ కామెంట్స్ వైర‌ల్

Published : Apr 09, 2025, 10:37 PM IST

Virat Kohli: 'టోర్నమెంట్ నిర్మాణాత్మకమైన విధానం కారణంగా ఐపీఎల్ మిమ్మల్ని చాలా ప్రత్యేకమైన రీతిలో సవాలు చేస్తుంది. ఇది చిన్న ద్వైపాక్షిక సిరీస్ లాంటిది కాదు.. ఇది చాలా వారాల పాటు కొనసాగుతుంది. పాయింట్ల పట్టికలో మీ స్థానం మారుతూ ఉంటుంది. ఆ మార్పు దృశ్యాలు మిమ్మ‌ల్ని అనేక ర‌కాలుగా ఒత్తిడికి గురిచేస్తుంద‌ని' ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అన్నాడు.  

PREV
15
Virat Kohli: నో ఈగో.. విరాట్ కోహ్లీ క్రికెట్ ఫిలాసఫీ కామెంట్స్ వైర‌ల్

Virat Kohli IPL journey: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో  రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 42 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. త‌న ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 8 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఈ క్ర‌మంలోనే టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగులు కొట్టిన తొలి భారత ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు.

 

25
Virat Kohli. (Photo- IPL)

అయితే, తాజాగా ఇప్ప‌టివ‌ర‌కు విరాట్ కోన‌సాగించిన విజ‌వంత‌మైన త‌న క్రికెట్ ప్రయాణం గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డించాడు. త‌న విజ‌యంలో కీల‌క‌మైన విష‌యాల‌ను పంచుకున్నాడు. తన అహాన్ని అదుపులో ఉంచుకుని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడమే తన ప్రాథమిక సూత్రమని కోహ్లీ చెప్పాడు. తనకు ఎప్పుడూ ఇగో లేదని చెప్పాడు.

35
Bhuvneshwar Kumar with Virat Kohli. (Photo- IPL)

బ్యాటింగ్ అనే విష‌యం ఎప్పుడూ ఇగో కు సంబంధించిన‌ది కాద‌ని విరాట్ కోహ్లీ అన్నాడు. అలాగే, "ఇది ఎప్పుడూ ఎవరినీ అధిగమించే ప్రయత్నం కాదు. నాకు ఇది ఎల్లప్పుడూ ఆట పరిస్థితిని అర్థం చేసుకోవడమే. ఇది నేను ఎప్పుడూ గర్వపడే విషయం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాలనుకుంటున్నాను" అని కోహ్లీ చెప్పాడు. 

అలాగే, "నేను ఫామ్‌లో ఉంటే, సహజంగానే బాధ్యత తీసుకోవడానికి చొరవ తీసుకునేవాడిని. మరొకరు బాగా ఆడుతున్నట్లయితే అతను ఇలాగే చేస్తాడు" అని విరాట్ అన్నాడు.

45
Virat Kohli. (Photo: IPL)

కాగా, విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు, పరుగులు చేసిన ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. 256 మ్యాచ్‌ల్లో ఎనిమిది సెంచరీలతో 8168 పరుగులు చేశాడు. అయితే, తాను 2011 సీజన్ నుండి ఈ ఫార్మాట్ అవసరాలను అర్థం చేసుకున్నానని కోహ్లీ చెప్పాడు. 

త‌న ఐపీఎల్ ప్ర‌యాణం గురించి కోహ్లీ మాట్లాడుతూ.."రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్ ప్ర‌యాణం మొద‌లైంది. మొదటి మూడు సంవత్సరాలలో నాకు టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. ఆ సమయంలో నేను ఐపీఎల్‌లో పెద్ద విజయాన్ని సాధించలేకపోయాను. 2010 నుండి నేను బాగా రాణించడం ప్రారంభించాను. దీంతో 2011 నుండి నేను క్రమం తప్పకుండా మూడవ స్థానంలో బ్యాటింగ్ లోకి వ‌చ్చాను. అప్పటి నుండి నేను నిలకడగా బాగా రాణించాను. లీగ్‌లో 18 సంవత్సరాలు గడపడం వల్ల అతి తక్కువ ఫార్మాట్ క్రికెట్‌లో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నానని" కోహ్లీ అన్నాడు. 

55
Virat Kohli

అలాగే, ఐపీఎల్‌లో విభిన్న సవాళ్లు ఉంటాయ‌ని విరాట్ కోహ్లీ అన్నాడు. "ఈ లీగ్ నిర్మాణం చాలా భిన్నంగా ఉండటం వల్ల ఐపీఎల్ మిమ్మల్ని చాలా ప్రత్యేకమైన రీతిలో సవాలు చేస్తుంది. ఇది చిన్న ద్వైపాక్షిక సిరీస్ లాంటిది కాదు, ఇది చాలా వారాల పాటు కొనసాగుతుంది. పాయింట్ల పట్టికలో మీ స్థానం మారుతూ ఉంటుంది. నిరంతరం మారుతున్న దృశ్యంతో వివిధ రకాల ఒత్తిళ్లు వస్తాయి. టోర్నమెంట్లు ఇతర ఫార్మాట్లలో లేని అనేక విధాలుగా మానసికంగా, పోటీతత్వంతో మిమ్మల్ని మీరు ముందుకు నెట్టడానికి మిమ్మల్ని సవాలు చేస్తాయి. ఇది నా టీ20 నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి కూడా నన్ను ప్రేరేపించింది" అని విరాట్ కోహ్లీ అన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories