ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ మొదట ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. భారీ టార్గెట్ లో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టు 19.2 ఓవర్లలో 159 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్థాన్ వరుస రెండు విజయాల పరంపరకు అహ్మదాబాద్‌లో బ్రేక్ పడింది.
గుజరాత్ ఇన్నింగ్స్ లో సాయి సుదర్శన్ సూపర్ నాక్ ఆడాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, జోస్ బట్లర్ 36, షారుక్ ఖాన్ 36 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. రాజస్థాన్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 2, తీక్షణ 2 వికెట్లు తీసుకున్నారు.
భారీ టార్గెట్ ఛేదనలో రాజస్థాన్ కు మంచి శుభారంభం లభించలేదు. జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 6 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. సంజూ శాంసన్ 41, రియాన్ పరాగ్ 26, హిట్మేయర్ 52 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు కానీ, జట్టుకు విజయాన్ని అందించే వరకు క్రీజులో నిలబడలేకపోయారు.