మీరు ఒక్క బౌలర్‌కే పొంగిపోతున్నారు.. అలాంటోళ్లు మాకు గల్లీకొకడు ఉన్నాడు.. ఉమ్రాన్‌పై పాక్ మాజీ పేసర్ కామెంట్స్

First Published Feb 4, 2023, 5:20 PM IST

టీమిండియా యువ సంచలనం ఉమ్రాన్ మాలిక్ వేగవంతమైన బౌలరే కావొచ్చు గానీ అలాంటి బౌలర్లు పాకిస్తాన్ లో గల్లీకొకరు ఉంటారని, దేశవాళీ క్రికెట్ లోకి వెళ్లి చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుందని....

గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ సోహైల్ ఖాన్.  ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  సోహైల్..   కోహ్లీ గురించి  ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా  సోహైల్..  టీమిండియా యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్  మీద  సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఉమ్రాన్   వేగవంతమైన బౌలరే కావొచ్చు గానీ అలాంటి బౌలర్లు పాకిస్తాన్ లో గల్లీకొకరు  ఉంటారని, దేశవాళీ క్రికెట్ లోకి వెళ్లి చూస్తే ఆ విషయం  స్పష్టంగా అర్థమవుతుందని  చెప్పాడు. నాదిర్ అలీ యూట్యూబ్ షో లో  అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.   
 

సోహైల్ మాట్లాడుతూ.. ‘ఉమ్రాన్ మాలిక్ మంచి బౌలరే.   అతడు ఆడిన మ్యాచ్ లు రెండు మూడు చూశాను. అతడిలో వేగం ఉంది. కానీ మిగతా విషయాలను  అంతగా పట్టించుకోవడం లేదు.   అయితే  ఉమ్రాన్.. గంటకు  150-155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడని అంటున్నారు. అదేం గొప్ప కాదు.  

పాకిస్తాన్ లో అలాంటి బౌలర్లను  నేను మీకు  15  - 20 మందిని చూపిస్తాను.  దేశవాళీ క్రికెట్ లో  ఉమ్రాన్ మాదిరి వేగంగా బంతులు విసిరేవాళ్లూ ఉన్నారు.  మీరు ఒకసారి లాహోర్ ఖలాండర్స్  నిర్వహించే   ట్రయల్స్ కు వెళ్లి చూడండి. అక్కడ ఉమ్రాన్ వంటి బౌలర్లు కోకొల్లలుగా వస్తారు... 

డొమెస్టిక్ స్థాయి నుంచి వచ్చే బౌలర్లు  అక్కడే రాటుదేలి వస్తారు. పాకిస్తాన్ జాతీయ జట్టులో  ఇప్పుడున్న  షాహీన్ షా అఫ్రిది, నసీమ్ షా,  హరీస్ రౌఫ్.. వీళ్లంతా దేశవాళీలో  రాటుదేలినవాళ్లే.  ఇలాంటి వాళ్ల  పేర్లు నా దగ్గర బోలెడన్నీ ఉన్నాయి.  కానీ వాళ్లింకా డొమెస్టిక్ క్రికెట్ లోనే మగ్గిపోతున్నారు...’అని చెప్పాడు. 

సోహైల్ చెప్పినట్టు  ఉమ్రాన్ మాదిరిగా అత్యంత వేగంతో బంతులు సంధించే  బౌలర్లు పాకిస్తాన్ లో ఉన్నారో లేదో తెలియదు గానీ  రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ తర్వాత  ఒక్క మహ్మద్ సమీనే 150 ప్లస్  స్పీడ్ తో బౌలింగ్ చేశాడు. నాటి నుంచి నేటి వరకు  చాలా మంది పాకిస్తాన్ బౌలర్లు జట్టులోకి వచ్చి వెళ్లారు.

Image credit: Getty

కానీ వారిలో  ఏ ఒక్కరూ  కూడా అక్తర్ రికార్డుకు రీచ్ కాలేకపోయారు. కనీసం ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు. కానీ నిండా 25 ఏండ్లు కూడా నిండని మన జమ్మూ ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే  గంటకు  155, 157 కిలోమీటర్ల వేగంతో బాల్స్ వేస్తున్నాడు.  త్వరలోనే తాను అక్తర్ రికార్డు (162 కి.మీ స్పీడ్) ను కూడా బ్రేక్ చేస్తానని  హామీ ఇచ్చాడు.  

click me!