ఇండియాని ఓడించాలంటే ఇదే ఛాన్స్! రిషబ్ పంత్, బుమ్రా కూడా లేరు... గ్రెగ్ చాపెల్ కామెంట్...

First Published Feb 4, 2023, 4:23 PM IST

గత మూడు సీజన్లుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ విజేతగా నిలిచింది భారత జట్టు. అందులో గత రెండు సీజన్లలో ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలో ఓడించింది టీమిండియా... 2004లో చివరిగా ఇండియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన ఆస్ట్రేలియా, ఈసారి భారత్‌లో మళ్లీ ఆ ఫీట్ రిపీట్ చేయాలని భావిస్తోంది...

ఇప్పటికే ఇండియాలో టెస్టు సిరీస్ గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ఆస్ట్రేలియా. భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి భారత యంగ్ బౌలర్లతో ప్రాక్టీస్ చేస్తున్న ఆస్ట్రేలియా, పగుళ్లు తేలిన పిచ్‌పై నెట్ ప్రాక్టీస్ చేస్తోంది...   

‘ఆస్ట్రేలియా, ఇండియాలో టెస్టు సిరీస్ గెలవాలనుకుంటే ఇదే వాళ్లకు సరైన సమయం. స్వదేశంలో టీమిండియా చాలా ప్రమాదకరమైన జట్టు. అయితే ఈసారి రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా వంటి ప్లేయర్లు గాయాలతో టీమ్‌కి దూరమయ్యారు...

ఇప్పుడు విరాట్ కోహ్లీపైన వాళ్లు ఎక్కువగా ఆధారపడ్డారు. విరాట్ కోహ్లీని త్వరగా అవుట్ చేస్తే, మిగిలిన బ్యాటర్లను పెవిలియన్ చేర్చడం పెద్ద కష్టమేమీ కాదు. భారత్‌కి వచ్చే పర్యాటక జట్లు, స్పిన్ బౌలింగ్ ఆడేందుకు చాలా కష్టపడతాయి. అయితే ఇప్పుడు ఆసీస్‌కి అలాంటి ఇబ్బంది కలగదని అనుకుంటున్నా...
 

Steve Smith and Marnus Labuschagne

ఆస్ట్రేలియా జట్టు, ఇప్పుడు భారత పరిస్థితులను అలవర్చుకోవాలి. స్పిన్ బౌలింగ్‌కి అనుకూలించే పిచ్‌పై మనవాళ్లు కూడా వాళ్ల బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలరు. అస్టన్ అగర్, ఫింగర్ స్పిన్‌ని ఎదుర్కోవడానికి భారత బ్యాటర్లు ఇబ్బంది పడతారు...

అనిల్ కుంబ్లే టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. కుంబ్లే స్పిన్ తిప్పే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. అలాంటి స్పిన్, అస్గన్ అగర్ దగ్గర చూశాను. రవీంద్ర జడేజా కూడా ప్రమాదకారి... అయితే జడ్డూని ఎదుర్కొన్న అనుభవం, ఆస్ట్రేలియా బౌలర్లకు ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు గ్రెగ్ చాపెల్...
 

click me!